ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) గత కొన్నేళ్లుగా ఏ సినిమాలో నటిస్తున్నా ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్లు సాధిస్తున్నారు.అల వైకుంఠపురములో, పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ సినిమాలతో బన్నీ ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్లు చేరాయనే సంగతి తెలిసిందే.అల వైకుంఠపురములో( Ala Vaikunthapurramloo ) సినిమా బుల్లితెరపై ప్రసారమైన సమయంలో ఏకంగా 29.8 రేటింగ్ ను సొంతం చేసుకుంది.బుల్లితెరపై రేటింగ్ విషయంలో ఇదే రికార్డ్ అని చెప్పవచ్చు.
అయితే పుష్ప ది రైజ్( Pushpa The Rise ) ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయినా పుష్ప ది రూల్( Pushpa The Rule ) ఆ రికార్డును బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ నెల 13వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు బుల్లితెరపై ఈ సినిమా ప్రసారం కానుంది.పుష్ప2 రూల్ సినిమాకు స్టార్ మా( Star Maa ) నిర్వాహకులు ఒకింత భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు.బుల్లితెరపై ఈ సినిమా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

బన్నీకి బుల్లితెర ప్రేక్షకుల్లో సైతం ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.పుష్ప2 సినిమా బుల్లితెరపై మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటే భవిష్యత్తులో ఎక్కువసార్లు రీ టెలీకాస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.అయితే థియేటర్లలో హిట్టైన ఎన్నో సినిమాలు బుల్లితెరపై ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సందర్భాలు అయితే ఎక్కువగానే ఉన్నాయనే సంగతి తెలిసిందే.

బన్నీ తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.బన్నీ భవిష్యత్తు సినిమాలు ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.త్రివిక్రమ్, అట్లీ డైరెక్షన్ లో బన్నీ సినిమాలు తెరకెక్కుతున్నాయి.
బన్నీ పారితోషికం 150 నుంచి 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.బన్నీ రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
బన్నీ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.







