స్పాట్ లెస్ స్కిన్( Spotless Skin ) ను ఎవరు కోరుకోరు చెప్పండి.దాదాపు అందరూ అటువంటి చర్మం తమ సొంతం కావాలని ఆశ పడుతుంటారు.
అందులో భాగంగానే రకరకాల చర్మ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే ఎన్ని ప్రొడక్ట్స్ వాడినా ఏదో ఒక రకంగా చర్మంపై డార్క్ స్పాట్స్ ఏర్పడుతూనే ఉంటాయి.
వాటిని వదిలించుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని అస్సలు మిస్ అవ్వకండి.
ముందుగా రెండు నిమ్మ పండ్లను( Lemons ) తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి పీల్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో నిమ్మ పండు తొక్కలు వేసుకోవాలి.అలాగే ఐదు లవంగాలు,( Cloves ) పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Turmeric ) మరియు ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి నిమ్మ తొక్కలు, లవంగాలు నానబెట్టుకున్న గిన్నెను పెట్టి దాదాపు పది నిమిషాల పాటు ఉడికించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.

పూర్తిగా కూల్ అయ్యాక ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి, హాఫ్ టీ స్పూన్ పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటించారంటే ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు.కేవలం మూడు నాలుగు వారాల్లోనే స్పాట్ లెస్ స్కిన్ ను మీ సొంతం అవుతుంది.

అలాగే ఈ రెమెడీ చర్మ ఆరోగ్యాన్ని పోషిస్తుంది.చర్మం పై పేరుకుపోయిన మురికి, మృతకణాలను తొలగిస్తుంది.చర్మానికి కొత్త మెరుపును జోడించి కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
కాబట్టి మచ్చలేని మెరిసే అందమైన ఆరోగ్యమైన చర్మాన్ని కోరుకునే వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని ప్రయత్నించండి.







