జుట్టు విపరీతంగా రాలిపోతుందా.? హెయిర్ ఫాల్ ను( Hairfall ) అడ్డుకునేందుకు రక రకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హెయిర్ మాస్క్ తో జుట్టు రాలే సమస్యను ఈజీగా దూరం చేసుకోవచ్చు.
అదే సమయంలో జుట్టు దట్టంగా పెరగడంలో కూడా ఈ మాస్క్ తోడ్పడుతుంది.
అందుకోసం ముందుగా ఒక అరటి పండును( Banana ) తీసుకుని పీల్ తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటిపండు ముక్కలు వేసుకోవాలి.అలాగే గుప్పెడు మునగాకు( Drumstick Leaves ) లేదా రెండు టేబుల్ స్పూన్లు మునగాకు పొడి, ఐదారు పుదీనా ఆకులు,( Mint Leaves ) కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.మునగాకు, పుదీనా, పెరుగు మరియు అరటి పండులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తాయి.
జుట్టు రాలడాన్ని ఎఫెక్టివ్ గా తగ్గిస్తాయి.వారానికి ఒకసారి ఇప్పుడు చెప్పుకున్న మాస్క్ ను కనుక వేసుకుంటే జుట్టు రాలడం తగ్గడంతో పాటు దట్టంగా సైతం పెరుగుతుంది.

ఈ హెయిర్ మాస్క్ కొత్త జుట్టు ఎదుగుదలకు అవసరమయ్యే పోషణను అందిస్తుంది.అదే సమయంలో జుట్టును మృదువుగా మరియు షైనీగా సైతం మారుస్తుంది.సో.హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్నవారు ఈ మాస్క్ ను ప్రయత్నించడంతో పాటు ఒత్తిడికి దూరంగా ఉండండి.పోషకాహారం తీసుకోండి.కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.మరియు హెయిర్ స్టైలింగ్ టూల్స్ వినియోగం తప్పనిసరిగా తగ్గించండి.