మాతృత్వం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ సృష్టిలోనే మధురమైన మాతృత్రం స్త్రీలకు మాత్రమే వరంగా దక్కింది.
అందుకే పెళ్లైన ప్రతి మహిళా గర్భం దాల్చాలని.బిడ్డకు జన్మనివ్వాలని.
అమ్మ అని పిలిపించుకోవాలని కోరుకుంటుంది.ఇక ఈ సమయంలో ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా.
ఎంతో ఇష్టంగా ఎదుర్కొంటుంది.అయితే మొదటి సారి ప్రెగ్నెంట్ అయిన వారు.
డెలివరీకి ముందు ఎన్నో భయాలను మనసులో నింపేసుకుంటారు.దాంతో ప్రసవం మరింత కష్టంగా మారుతుంది.
ఇది తల్లికి, బిడ్డకు ఏ మాత్రం మంచిది కాదు.
అయితే డెలివరీకి కొన్ని రోజుల ముందు నుంచి ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఫాలో అయితే.
ప్రసవానికి మీకు మీరే మీ శరీరాన్ని స్ట్రోంగ్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు.మరి ఆ టిప్స్ ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ఫస్ట్ మంత్ నుంచి వ్యాయామాలు చేసినా చేయక పోయినా.డెలవరీకి కొన్ని ఒకటిన్నర నెల ముందు నుంచి ఖచ్చితంగా చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి.
దీంతో టైట్‌గా ఉండే కండరాలను కాస్త లూజ్‌గా మారతాయి.ఫలితంగా, డెలివరీ సులువు అవ్వడంతో పాటు ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు దూరం అవుతాయి.
అలాగే డెలివరీ సమయంలో వచ్చే నొప్పును తగ్గించడంలో బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు అద్భుతంగా సహాయ పడతాయి.కాబట్టి, వీటిని కూడా డెలివరీకి కాస్త ముందు అలవాటు చేసుకోవాలి.ఇక డెలివరీ దగ్గర పడుతున్న సమయంలో తీసుకునే ఫుడ్‌లో కూడా పలు మార్పులు చేసుకోవాలి.ముఖ్యంగా సోడియం, స్పైసెస్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.వైట్ రైస్‌కు కూడా దూరంగా ఉండాలి.
డెలివరీకి కొన్ని రోజుల ముందు నుంచి.
మీకు ఇష్టమైన వారితో ఎక్కువ సమయాన్ని గడపండి.దాంతో మీకు మానసిక ప్రశాంత వస్తుంది.
అలాగే కొందరికి డెలివరీ గురించి సరైన అవగాహన లేక తెగ భయపడుతూ ఉంటారు.అందవల్ల, నార్మల్ డెలివరీ మరియు సిజేరియన్ రెండింటిపై కాస్త అవగాహన పెంచుకోవాలి.
ఇక డెలివరీ దగ్గర పడుతున్న సమయంలో ప్రతి రోజు పొట్ట, పెల్విక్ ప్రాంతాల్లో ఆయిల్ మసాజ్ చేయించు కోవాలి.దీని వల్ల డెలివరీ ఈజీ అవుతుంది.