విజయవాడ: విజయవాడ నగర పాలక సంస్థలో జరుగుతున్న కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నోత్తరాలను బాయ్ కాట్ చేసిన టీడీపీ, సిపిఎం కార్పొరేటర్లు. అధికార పక్షం సభ్యుల హక్కులను కలరాస్తోందని ఆరోపించిన టీడీపీ కార్పొరేటర్లు.
తమ ప్రశ్నలను పరిగణలోకి తీసు కోకుండా సమస్యలపై చర్చించ కుండా కౌన్సిల్ నిర్వహిస్తున్నారని మండి పడ్డ టీడీపీ కార్పొరేటర్లు.చట్టం ప్రకారం వెళ్లకుండా వాళ్ల రాజ్యాంగం ప్రకారం ముందుకు వెళుతున్నారని టీడీపీ కార్పొరేటర్లు.
టీడీపీ , సిపిఎం కార్పొరేటర్లు మాట్లాడుతూ.చట్టం తెలియకుండా అధికారులు వ్యవహరిస్తున్నారు.
సమస్యలపై ప్రశ్నిస్తుంటే ఎదురుదాడి చేస్తున్నారు.చట్ట ప్రకారం ఒక్కో సభ్యడు మూడు ప్రశ్నలు అడిగే హక్కు ఉంది.
మేయర్ ఒక్క ప్రశ్నకు మాత్రమే అనుమతి ఉందని ఇతర ప్రశ్నలపై చర్చను తిర్కరించారు.కార్పొరేషన్ కు 50వేలు పైబడి బకాయిలు వారి వివరాలు.
పోల్స్ పై కేబుల్స్ వేసిన వారి వివరాలు.
టిడ్కో లబ్దిదారులకు ఇళ్లు లేదా డబ్బులు ఇచ్చే అంశాలు అడిగాం.
ప్రభుత్వ లోపాలు బయట పడతాయనే చర్చకు తిరస్కరించారు.అందుకే సమావేశాన్ని బహిష్కరించి మా నిరసన తెలిపాం.
కౌన్సిల్ సమావేశంలోకి మీడియా అనుమతించ కుండా ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం వైకాపా చేస్తోంది.