పవన్, తారక్ సినిమాలలో ఛాన్స్ కావాలని చెబుతున్న మృణాల్ ఠాకూర్.. ఛాన్స్ దక్కుతుందా?

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం ఒకవైపు హీరోగా సినిమాలలో నటిస్తూనే మరొకవైపు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.త్వరలోనే హరిహర వీరమల్లు, ఓజీ లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

 Mrunal Thakur Expect Acting Pawan And Ntr Details, Mrunal Thakur, Pawan Kalyan,-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్ ఇంకా పెండింగ్ దశలోనే ఉంది.రెండు సినిమాలు కూడా కొంతమేర షూటింగ్ ని జరుపుకున్నాయి.

కానీ ఈ రెండు సినిమాలు ఎప్పుడు పూర్తిస్థాయిలో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అవుతాయి అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.

Telugu Adivi Sesh, Dacoit, Mrunal Thakur, Jr Ntr, Mrunalthakur, Pawan Kalyan, To

మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) కూడా నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా గురించి ప్రకటించడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఇప్పుడు ఆ ఇద్ద‌రు హీరోల‌తో న‌టించాల‌నుంద‌ని ప్ర‌తిభావంతురాలైన మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) త‌న కోరికను బయటపెట్టింది.ఇప్పటివరకు కేవలం నాని హీరో విజయ్ దేవరకొండ లాంటి హీరోల సరసన నటించే అవకాశాలను మాత్రమే సొంతం చేసుకుంది మృణాల్ ఠాకూర్.

మ‌రో మెట్టు ఎక్కాలంటే క‌చ్ఛితంగా పాన్ ఇండియ‌న్ స్టార్లు ఎన్టీఆర్, ప‌వ‌న్, రామ్ చ‌ర‌ణ్, బ‌న్ని వంటి స్టార్లు అవ‌కాశం క‌ల్పించాల్సి ఉంది.

Telugu Adivi Sesh, Dacoit, Mrunal Thakur, Jr Ntr, Mrunalthakur, Pawan Kalyan, To

అయితే ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ల సరసన నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అంటుంది ఈ ముద్దుగుమ్మ.అయితే ఆ ఇద్ద‌రు స్టార్లు అవ‌కాశం క‌ల్పించ‌డం అంటే అంత సులువైన విష‌యం కాదు.చాలా విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఓకే చెప్పాల్సి ఉంటుంది.

ప్ర‌స్తుతానికి అడివి శేష్ స‌ర‌స‌న డెకాయిట్ లో( Dacoit Movie ) నటిస్తున్న ఈ బ్యూటీకి టాలీవుడ్‌ లో మ‌రో అవ‌కాశం లేదు.మృణాల్ త‌న‌కు పెద్ద హీరోలు అవ‌కాశాలు క‌ల్పిస్తార‌నే ఆశ‌తో ఉంది.

కానీ అది సాధ్య‌ప‌డుతుందా లేదా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.ఒకవేళ అవకాశం ఇస్తే ఈ ముద్దుగుమ్మ పంట పండినట్టే అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube