ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6:04 సూర్యాస్తమయం: సాయంత్రం 6:32రాహుకాలం: మ.01:51 నుంచి మ.3.25 వరకుఅమృత ఘడియలు: ఉ.10:08 నుంచి ఉ.11.54 వరకుదుర్ముహూర్తం: ఉ.10.13 నుంచి ఉ.11.03 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు కొత్త వ్యక్తులను కలుస్తారు.వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతారు.
ఆర్ధికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి రోజు చివరికి మంచి ఫలితం ఉంటుంది.జీవిత భాగస్వామితో ఈరోజు ఆనందంగా గడుపుతారు.
వృషభం:
ఈరోజు అంతా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆనందంగా గడుపుతారు.కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి చురుకైన ఆలోచనలతో విజయాన్ని సొంతం చేసుకుంటారు.కొద్ది సమయం ధ్యానం చేస్తే మంచిది.
మిథునం:
మీ బంధువులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.రోజు ప్రారంభంలో వత్తిడికి గురైనప్పటికి సంతోషంగా జీవిస్తారు.భాగస్వామితో మీ వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలను పంచుకొని ఆనందంగా గడుపుతారు.
కర్కాటకం:
ఈరోజు ఎవరైనా అప్పు అడిగితే అసలు ఇవ్వకండి.సమస్యలు వస్తాయ్.మానసికంగా ఇబ్బందులకు గురవుతారు.మీకు వచ్చిన కష్టాన్ని ఇతరులతో పంచుకోలేరు.అందుకే కాసేపు ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత మీ సొంతం!
సింహం:
ఎప్పటి నుంచో పడుతున్న ఇబ్బందులు అన్ని ఈరోజు తీరిపోతాయి.మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.
ఆర్ధిక అభివృద్ధి ఉంటుంది.భాగస్వామికి మీకు మధ్య అపార్ధాలు దూరం అయ్యి ఆనందంగా ఉంటారు.
కన్య:
ఈరోజు అంతా ఎంతో ఉల్లాసంగా సంతోషంగా ఉంటారు.అనారోగ్య సమస్యలు తీరి సంతోషంగా ఉంటారు.అంతేకాదు మీ ఆఫీస్ లో కూడా ఇన్నాళ్లు కష్టపడిన పనిని గుర్తించి ప్రశంసలు అందుకుంటారు.ఆర్ధికంగా ఆనందంగా ఉంటారు.
తులా:
చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి.అప్పుడే ఆరోగ్యగంగా ఉంటారు.
ఆర్ధికంగా జాగ్రత్తగా ఉండాలి.డబ్బును చూసి ఖర్చు పెట్టుకోవాలి.వైవాహిక జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయ్ కానీ ఆలోచనలు, పెద్ద సలహాలు తీసుకొని పరిష్కరించుకోవాలి.
వృశ్చికం:
ఎన్ని సమస్యలు వచ్చిన మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.జాగ్రత్తగా ఉండాలి.అప్పుడే కష్టాల కడలి నుంచి బయటపడతారు.
కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు.నోటి దురుసు తగ్గించుకుంటే మీ పెద్దల వద్ద గౌరవంగా ఉంటారు.
ధనస్సు:
పాత మిత్రులను కలిసి సంతోషంగా ఉంటారు.భవిష్యత్తు కోసం కాస్త పొదుపు చేస్తారు.
ప్రియమైన వారి కోసం కొంత డబ్బును సమయాన్ని ఇస్తారు.జీవిత భాగస్వామితో పొదుపు గురించి చర్చించి మంచి ఆలోచనలతో ముందుకు అడుగులు వేస్తారు.
మకరం:
చెడు అలవాట్లకు దూరం అవుతే బాగుంటుంది.వాటి కారణంగా ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి.పిల్లలకు సరైన సమయానికి సహాయం చెయ్యలేరు.విద్యార్థులు మంచి చదువులో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు.వ్యాపారాలలో మంచి లాభాలను చూస్తారు.
కుంభం:
ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడుతారు.కానీ పెద్దవారి సహాయంతో వాటి నుంచి బయటపడతారు.ఇంటి అవసరాల కొరకు కొన్ని ఖర్చులు చేస్తారు.భాగస్వామితో గొడవలు పడుతారు.అందుకే మాట్లాడే సమయంలో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది.
మీనం:
పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు.డబ్బును పొదుపు చేస్తారు.ఒకటికి రెండు సార్లు ఆలోచించి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతారు.జీవిత భాగస్వామితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు.
LATEST NEWS - TELUGU