గొంతు నొప్పి.( Sore throat ) దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు.
ముఖ్యంగా ప్రస్తుత చలికాలంలో చాలా మంది గొంతు నొప్పితో బాధపడుతుంటారు.ఇది చిన్న సమస్య అయినప్పటికీ.
తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుంది.గొంతు నొప్పి కారణంగా తినడం, తాగడం చాలా కష్టతరంగా ఉంటుంది.
ఒక్కోసారి గొంతు నొప్పి వల్ల మాట కూడా పడిపోతుంది.ఈ క్రమంలోనే గొంతు నొప్పిని వదిలించుకోవడం కోసం మందులు వాడుతుంటారు.

కానీ సహజంగా కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే టీలు అద్భుతంగా సహాయపడతాయి.ఈ లిస్టులో మొదట చెప్పుకోవాల్సింది.పుదీనా టీ.( Mint tea )గొంతు నొప్పిని తరిమి కొట్టడానికి ఈ టీ గ్రేట్ గా సహాయపడుతుంది.పుదీనాలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ గొంతులో ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది.
గొంతు నొప్పికి చెక్ పెడుతుంది.అలాగే గొంతు నొప్పిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన టీల జాబితాలో చమోమిలే టీ ఒకటి.
ఈ టీలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.అందువల్ల ఈ టీ అనేక జబ్బులకు చెక్ పెడుతుంది.
ప్రతిరోజు ఈ టీని తాగితే గొంతు నొప్పి దూరం అవుతుంది.వెయిట్ లాస్ అవుతారు.
రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో సైతం ఉంటాయి.

గొంతు నొప్పితో బాధపడుతున్న వారికి అల్లం టీ ( Ginger tea )కూడా చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది.అల్లం లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గొంతు నొప్పి, గొంతు వాపు, దగ్గు, జలుబు వంటి సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తాయి.ఇక ఫైనల్ గా గ్రీన్ టీ.
చాలామంది వెయిట్ లాస్ కు మాత్రమే ఈ టీ ఉపయోగపడుతుందని భావిస్తారు.కానీ అలా నిజం కాదు.
గ్రీన్ టీ ఆరోగ్యపరంగా బోలెడు ప్రయోజనాలను చేకూరుస్తుంది.గొంతు నొప్పిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
రోజుకు ఒక కప్పు గ్రీన్ టీ తాగితే ఇమ్యూనిటీ పవర్( Immunity power ) పెరుగుతుంది.ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తి లభిస్తుంది దీంతో చాలా వేగంగా గొంతు నొప్పిని దూరం చేసుకోవచ్చు.







