డిప్రెషన్ ను దూరం చేసుకోవాలంటే.. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ పనులను చేయండి..!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు బిజీబిజీగా జీవిస్తున్నారు.దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలలో డిప్రెషన్ సమస్య( Depression ) పెరిగిపోతూ వస్తుంది.

దీన్ని అదుపు చేసుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉందని మానసిక వైద్య నిపుణులు ( Psychiatrists )చెబుతున్నారు.మీరు ఒత్తిడి, నిస్సృహలో ఉంటే మీకు ఏ పని చేయాలని అనిపించదు.

మీ మానసిక ఆరోగ్యం కూడా పూర్తిగా దూరమవుతుంది.ఇవన్నీ డిప్రెషన్ ప్రారంభ లక్షణాలు అని వైద్యులు చెబుతున్నారు.

అటువంటి పరిస్థితులలో డిప్రెషన్ నుంచి బయటపడాలంటే మీరు ప్రతి రోజు ఉదయం కొన్ని అలవాట్లను మార్చుకోవాలి.కొన్ని అలవాట్లను మీరు తినే చర్యలో భాగం చేసుకోవడం వల్ల డిప్రెషన్ ను దూరం చేసుకుని కొత్త రోజు ను ఉత్సాహంగా మొదలు పెట్టవచ్చు.

ముఖ్యంగా చెప్పాలంటే మంచి మానసిక ఆరోగ్యం ఉన్నవారు ఉదయాన్నే బ్రష్ ( Brush )చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు.

కానీ డిప్రెషన్ తో బాధపడేవారు దీన్ని కష్టమైన పనిగా భావిస్తూ ఉంటారు.ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం దంతాలను శుభ్రం చేసుకోవడానికి చాలా తక్కువ శక్తి అవసరం అవుతుంది.అలాంటి పరిస్థితులలో మీరు ప్రతి రోజు సరైన సమయం కేటాయించి బ్రష్ చేస్తే డిప్రెషన్ దూరం అవుతుంది.

ఇంకా చెప్పాలంటే డిప్రెషన్ ను దూరం చేసుకోవడానికి ఉదయం సమయంలో కనీసం 15 నిమిషాల పాటు ఎండలో కూర్చోవడం ఎంతో మంచిది.

ప్రతి రోజు ఉదయాన్నే త్వరగా నిద్ర మేలుకోవడం కూడా డిప్రెషన్ ను దూరం చేసే మార్గాలలో ఒక గొప్ప మార్గం.ఇంకా చెప్పాలంటే ఉదయాన్నే కొన్ని శ్వాస వ్యాయామాలు చేస్తే మానసికంగా దృఢంగా ఉంటారని మానసిక ఆరోగ్యా నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే మీ బ్రేక్ ఫాస్ట్ ఎప్పుడు సరైన సమయానికి, తగిన మోతాదులో తీసుకోవడం మంచిది.

అప్పుడే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే ఇంకా మీకు ఇష్టమైన చిన్న చిన్న పనులను చేయడం కూడా ఎంతో ముఖ్యం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube