వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడడం అనేది చాలా కామన్.కానీ ఇటీవల రోజుల్లో ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, హార్మోన్ల ప్రభావం తదితర కారణాల వల్ల చిన్న వయసులోనే కొందరికి ముఖంపై ముడతలు( Face Wrinkles ) ఏర్పడుతున్నాయి.
ఈ మడతలను వదిలించుకునేందుకు పడే తంటాలు అన్ని ఇన్ని కావు.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ఇంటి చిట్కాలను పాటిస్తే సులభంగా ముడతలను మాయం చేసుకోవచ్చు.

రెమెడీ 1:
ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు ప్యూరీ,( Papaya Puree ) వన్ టీ స్పూన్ తేనె,( Honey ) వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆపై 15 నిమిషాలు చర్మాన్ని ఆరబెట్టుకుని వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు లేదా మూడుసార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే ముడతలు క్రమంగా మాయమవుతాయి.
బొప్పాయి పండు లోని విటమిన్ సి మరియు బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తాయి.స్కిన్ ను టైట్ గా బ్రైట్ గా మారుస్తాయి.

రెమెడీ 2:
ముడతల సమస్యతో బాధపడే వారికి మరొక అద్భుతమైన రెమెడీ ఉంది.నైట్ నిద్రించే ముందు ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్,( Coconut Oil ) వన్ టీ స్పూన్ రోజ్ వాటర్,( Rose Water ) హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి బాగా మసాజ్ చేసుకుని నిద్రించాలి.మరుసటి రోజు గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.రెగ్యులర్ గా ఈ చిట్కాను పాటించిన కూడా ముడతలు దెబ్బకు పరారవుతాయి.చర్మం యవ్వనంగా ఆరోగ్యంగా మారుతుంది.