శనివారం నల్ల మిరియాలతో అలా చేస్తే ఏం అవుతుందో తెలుసా?

శనివారం రోజున శని గ్రహానికి అధిపతి.శనివారం శనీశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు.

 Do This With Black Pepper On Saturday, Saturday Pooja Vidhanam, Black Pepper, P-TeluguStop.com

శనివారం శనీశ్వరునికి ప్రత్యేక పూజలంకరణ చేసి పూజించడం వల్ల ఏలినాటి శని తొలిగి వారి కుటుంబం సుఖ సంతోషాలతో గడుపుతుంది.శనివారం రోజున సాధారణంగా వంటలలో వాడే ఎరుపు మిరియాలకు బదులుగా, నల్లని మిరియాలు వాడడం ద్వారా శని ప్రభావం తొలిగిపోయి ఆర్థికంగా నిలదొక్కుకుంటారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

శనివారం రోజున ఎటువంటి పూజా పద్ధతులను పాటించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…
శనివారం రోజున నవగ్రహాలలో శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ద్వారా శని బాధలు తొలగిపోతాయని వారి జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుందని పండితులు చెబుతున్నారు.అలాగే శనివారం వంటలలో నల్ల మిరియాలు పొడిని వాడడం వల్ల శని అనుగ్రహం కలిగి వారి మీద శని ప్రభావం తొలగిపోతుంది.

శనివారం నల్లని దుస్తులను ధరించి పూజ చేయడం ద్వారా శుభం కలుగుతుంది.అంతేకాకుండా నల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా మంచి జరుగుతుందని భావిస్తారు.

శనివారం ఉదయమే రావిచెట్టును దర్శించడం ద్వారా, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.శనివారం ఉదయం పాలు , నీళ్ళతో పాటు చక్కెరను కలిపి రావి చెట్టును పూజించడం ద్వారా అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు .అంతేకాకుండా, ఆర్థికంగా అభివృద్ధి చెంది ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తారు. రావి చెట్టుకు కొద్దిగా నువ్వుల నూనె వేసి దీపారాధన చేయడం వల్ల ఈ శుభ ఫలితాలను పొందుతారు.

శనివారం ఎవరైతే తప్పకుండా రావి చెట్టును ఆరాధిస్తారో వారికి శని ప్రభావం తొలగిపోతుందని బ్రహ్మ పురాణంలో 118 వ అధ్యాయంలో సాక్షాత్తు శనీశ్వరుడు చెబుతాడు.అంతేకాకుండా శనివారం రోజున ఆంజనేయస్వామికి, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా ఎంతో ప్రత్యేకం కనుక శనివారం హనుమాన్ చాలీసా, వెంకటేశ్వర స్తోత్రాలు పఠించడం ద్వారా ధనలాభం కలుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube