ఆశ్వయుజ అమావాస్యనే దీపావళిగా వ్యవహరిస్తుంటారు.నిజానికి దీపావళి నాటి అర్థ రాత్రి లక్ష్మీ పూజ చేయాలి.
పగటి పూట పితృ దేవతలకి తర్పణాలని విడవాలి.ఆ మరుసటి రోజు నుంచి ప్రారంభమయ్యేదే కార్తిక మాసం.
ఆ కార్తీక శుద్ధ పాడ్యమి నించి పితృ దేవతలంతా ఆకాశ మార్గం గుండా తమ తమ లోకాలకి ప్రయాణిస్తుంటారు.ఆ కాలంలోవారికి త్రోవ చూపేందుకుగాను ఒక దీపం మన వైపు నుండి ఏర్పాటు చేయడం ఏదుందో అదే ఆకాశ దీపం.
అంటే ఈ దీపం భూమి మీది వారికి వెలుగునీయడానికి ఉద్దేశించింది కాదనీ, పితృ దేవతలకి మాత్రమే త్రోవ చూపేదనీ అర్థం చేయడం కోసమే దానిని శివాలయాలలో ధ్వజ స్తంభం పై భాగంలో ఏర్పాటు చేస్తారు.అది కూడ కొండెక్కిపోకండా ఉండడం కోసం చిల్లులున్న గుండ్రని పాత్రలో నిక్షిప్తం చేస్తారు.
అలాగే ఆకాశ దీపం శివ కేశవుల తేజస్సు జగత్తుకు అందిస్తుంది.ఆకాశ దీపం మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే శివ కేసవులు శక్తితో ఈ దీపం ధ్వజ స్తంభంపై నుంజి జగత్తుకు అంతా వెలుతురు ఇస్తుంది.
ఇవ్వాలి అని వెలిగిస్తారు.దీపాన్ని వెలిగిస్తూ… దామోదరమావాయామి అని త్రయంబకమావాహయామి అని శివ కేశవులను ఆహ్వానిస్తూ… వెలిగిస్తారు.
ఒఖ్కో చోట రెండు దీపాలు శివ కేశవుల పేరుతో, వెలిగిస్తారు.లేదా ఒకో దీపం పెట్టి శివ కేశవుల్లో ఎవరో ఖర్ని ఆహ్వానిస్తూ… వెలిగిస్తారు.
ఇలా చేయడం వల్ల శివ కేశవుల్లో ఎవరో ఒకరు దీపంలోకి ఆహ్వానిస్తారు.