రావణుడి పై విజయం కోసం రాముడు పఠించిన రుద్రాష్టకం.. ప్రాముఖ్యత ప్రయోజనాలు ఇవే..!

హిందూ విశ్వాసం ప్రకారం రుద్రాష్టకం ఎప్పుడు, ఎలా చదవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే హిందూ విశ్వాసం ప్రకారం శివుడిని ఎప్పుడైనా పూజించవచ్చు.

 Rudrashtakam Recited By Rama For Victory Over Ravana.. These Are The Important B-TeluguStop.com

ఏ సమయంలోనైనా శివ స్తోత్రాన్ని పాటించవచ్చు.అయితే

శివుడి

పూజాఫలం త్వరగా లభించాలంటే శివయ్యకు ఇష్టమైన నెల, ఇష్టమైన తేదీ, ఇష్టమైన సమయంలో మాత్రమే పూజలు చేయాలి.

రుద్రాష్టకం పారాయణం చేసినా సత్ఫలితాలు కలగాలంటే సాయంత్రం పూట ఈశాన్య మూలలో కూర్చొని నియమానుసారంగా శివునికి( Lord shiva ) అభిషేకం చేయాలి.నిబంధనల ప్రకారం ఎరుపు రంగు ఉన్ని ఆసనం లేదా కుశ ఆసనం పై కూర్చుని శివునికి పూజ చేయాలి.

శ్రావణమాసంలో ఏడు రోజుల పాటు రుద్రాష్ట( Rudrashtakam )కం పారాయణం చేయడం ద్వారా సాధకుని కోరిక నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే రుద్రాష్టకం చదివితే ఈ గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి.

Telugu Bhakti, Devotional, Lord Rama, Lord Shiva, Puja, Ravana, Rudrashtakam, Tu

సనాతన సంప్రదాయంలో శివుడిని స్తుతించే రుద్రాష్టకం చదివితే శివ భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయి.హిందు విశ్వాసాల ప్రకారం శివ పూజ సమయంలో రుద్రాష్టకం పఠించడం వల్ల జీవితానికి సంబంధించిన శరీరక, మానసిక సమస్య నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు.మీరు ఏదో ఒక విషయంలో చాలా కాలంగా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే, ఆ కేసులో త్వరగా విజయం సాధించాలని కోరుకుంటూ శ్రావణమాసంలో ప్రతి రోజు రుద్రాష్టకం పఠించాలి.ఇలా చేయడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి త్వరగా బయటపడతారు.

Telugu Bhakti, Devotional, Lord Rama, Lord Shiva, Puja, Ravana, Rudrashtakam, Tu

ఇంకా చెప్పాలంటే మీకు తెలిసిన లేదా తెలియని శత్రువుల భయం ఎల్లప్పుడూ ఉంటే మీరు దానిని జయించడానికి లేదా దానిని వదిలించుకోవడానికి ప్రతి రోజు సాయంత్రం రుద్రాష్టకం పఠించాలి.ఇంకా చెప్పాలంటే హిందువుల విశ్వాసం ప్రకారం శ్రీ తులసీదాస్( Tulsidas ) రచించిన రుద్రాష్టకం పఠించే సాధకుడి పై దేవ దేవుడు మహాదేవుడు భోళా శంకరుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది.దీనివల్ల అతని కష్టాలన్నీ రెప్పపాటులో తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube