జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.మన జాతకంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే తప్పనిసరిగా నవగ్రహాలకు పూజ చేసే పరిహారం చేయాలని పండితులు చెబుతుంటారు.
ప్రస్తుతం మనం ఏ ఆలయానికి వెళ్లిన అక్కడ నవగ్రహాలు మనకు దర్శనమిస్తాయి.అయితే చాలామంది నవగ్రహాలను పూజించడానికి వెనకడుగు వేస్తారు.
నవగ్రహాలలో శని ఉంటాడు కనుక నవగ్రహాలకు పూజ చేయడం వల్ల శని ఆవహిస్తుందన్న కారణంచేత చాలామంది నవగ్రహాలను దర్శనం చేసుకోవడానికి ఇష్టపడరు.అయితే నవగ్రహాలకు పూజలు చేసిన తర్వాత కొన్ని పనులు చేయకపోవటం వల్ల ఆ పూజ ఫలితాన్ని పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు.
మరి నవగ్రహాల దర్శనం తర్వాత ఏ విధమైనటువంటి పనులు చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయంలో ప్రవేశించే ముందు శుభ్రంగా కాళ్లు కడుక్కొని దైవభక్తితో మనసులో ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆలయంలోనికి ప్రవేశించాలి.
ఆలయంలోకి వెళ్ళిన భక్తులు దైవారాధన తో గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆలయంలో ఉన్నటువంటి ఉప ఆలయాలను సందర్శించి అనంతరం నవగ్రహాల మండపంలోనికి వెళ్ళాలి.అక్కడ నవగ్రహాలను పూజ చేసుకొని నవగ్రహ మండపం నుంచి బయటకు వచ్చేటప్పుడు వెనుతిరిగి రావాలి.
ఇలా గర్భగుడిలోని స్వామి దర్శనం అనంతరం నవగ్రహాల పూజ చేసుకున్న తర్వాత సరాసరి ఇంటికి వెళ్లాలి.ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా మంది కాళ్ళు కడుక్కొని లోపలికి ప్రవేశిస్తారు.అలా చేయడం పూర్తిగా తప్పు.దైవారాధనలతో ఆలయం నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఇంటిలోపలికి కాళ్లు కడుక్కుని వెళ్లటం వల్ల మనం చేసిన పూజ ఫలితం వ్యర్థమవుతుంది కనుక లోపలికి ప్రవేశించి కాసేపు ఆగిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి.
నవగ్రహాల పూజ తర్వాత ఈ విధమైనటువంటి నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL