సినిమా కోసం ఎలాంటి పని చేయడానికి అయినా వెనకాడని నటుడిగా పేరు సంపాదించుకున్న వ్యక్తి కమల్ హాసన్(Kamal Haasan ) .ఆయన సినిమా పరిశ్రమకు దొరికిన ఒక ఆణిముత్యం అలాగే సినిమా కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడరు.
గొప్పగా సినిమా ఉంటుంది అనుకుంటే అందుకోసం తన శరీరంలో ఎలాంటి మార్పు చేసుకోవడానికైనా ఒక్క క్షణం కూడా ఆలోచించని వ్యక్తి కమల్ హాసన్.ఇలాంటి నటులు చాలా అరుదుగా ఉంటారు అందుకే కమల్ హాసన్ నేను లోకనాయకుడిగా పిలుచుకుంటూ ఉంటారు అభిమానులు.
ఆయన సినిమా చేస్తున్నాడంటే అది హిట్టు అవుతుందో కాదు అనే సంగతి పక్కన పెట్టి ఖచ్చితంగా సినిమా చూడడానికి అలాగే ఈ సినిమాలో కమల్ కొత్తగా ఏం చేశాడో తెలుసుకోవడానికి అయినా కూడా వెళ్తారు.

అంతటి కమల్ హాసన్ సినిమా కోసం చేసిన త్యాగాలు అలాగే సినిమా కోసం తనను తాను మార్పులు చేసుకోవడంలో చూపించే శ్రద్ధ గురించి ఒక చిన్న ఉదాహరణ ఈరోజు తెలుసుకుందాం.సత్యమే శివం( Satyama shivam ) అనే సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.కమల్ హాసన్ తో పాటు మాధవన్( Madhavan ) కూడా లీడ్ రోల్ లో నటించారు అయితే ఈ సినిమాలో గమనించాల్సిన విషయం ఏమిటి అంటే కమల్ హాసన్ ధరించిన కళ్లద్దాలు, వాటి లెన్స్ కాస్త విచిత్రంగా ఉంటుంది.
ఎందుకంటే ఆయన ధరించే అద్దాల వెనుక నుంచి కూడా కళ్ళు స్పష్టంగా కనిపించాలని ఉద్దేశంతో ఆయనకు ఒక మైనస్ 10 పవర్ లెన్స్ ఉన్న అద్దాలను ఇచ్చారు.అవి ధరించి షూటింగ్ చేయడం చాలా కష్టం.

కానీ అందుకు ఏమాత్రం వెనకాడ లేదు కమల్ హాసన్.సినిమా బాగా వస్తే చాలు ఎలాంటి శ్రమ అయినా ఆయన తీసుకోవడానికి వెనుకాడరు.అయితే ఇక్కడ చిన్న చమత్కారం చేశారు కమల్.మైనస్ 10 లెన్స్ వేసుకుంటే కళ్ళ ముందు వచ్చే మనిషి కూడా కనబడకుండా కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉంటుంది అందుకే కెమెరా ఫ్రేమ్లో కళ్లద్దాలు, లోపలి కళ్ళు అలాగే యధార్థవంతంగా తెలియడం కోసం మైనస్ కి బదులు ప్లస్ 10 ఉన్న వాటితో కమల్ హాసన్ ఈక్వల్ చేసి మరీ ధరించాడు.
దాంతో దర్శకుడు కమల్ హాసన్ చేసిన పనికి హాట్సాఫ్ చెప్పాడట.దట్ ఈజ్ కమల్ హాసన్ అని ప్రతి ఒక్కరు ఆ సినిమా తర్వాత జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నారు.