తాను మరణించాక తన సమాధి పై సావిత్రి రాయమని చెప్పిన వ్యాఖ్యలు ఏమిటి ?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మహానటి సావిత్రి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సావిత్రి హీరోయిన్ గా చలామణి అయిన సమయంలో హీరోలకు మించి రెమ్యూనరేషన్ తీసుకునేది.

 Savitri About Her Last Words Memorial ,savitri,high Remuneration , Last Words M-TeluguStop.com

అంతే కాదు హీరోల కన్నా కూడా ఆమె ఇంటి ముందు దర్శకుల క్యూ ఎక్కువగా ఉండేది.ఆమె అవకాశం కోసం ఎంతోమంది ఎదురు చూసేవారు అంటే ఆమెకు ఎంత క్రేజ్ ఉండేదో అర్దం చేసుకోవచ్చు.

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సావిత్రి కి ఒక్క అవార్డ్ కూడా దక్కలేదు అంటే నిజంగా బాధాకరం.

Telugu Memorial, Savitri, Shivaji Ganesan, India, Sr Ntr, Sv Ranga Rao, Tollywoo

చివరికి రఘుపతి వెంకయ్య పురస్కారం కూడా సావిత్రిని వరించలేదు అంటే ఆమె అవార్డులకు వ్యతిరేకి అనుకోవచ్చా ? లేదా అసలు ఆమెని ఇండస్ట్రీ గుర్తించలేదని బాధపడాలా ? అర్థం కాని పరిస్థితి.ఒకానొక సందర్భంలో అన్న ఎన్టీఆర్ సావిత్రి గురించి మాట్లాడుతూ ఆమెతో నటించడం గొప్ప అనుభవం అంటూ, అలాగే ఆమెతో నటిస్తున్న సమయంలో భయపడిన సందర్భాలు కూడా తన జీవితంలో ఉన్నాయని చెప్పారు.ఎస్వీ రంగారావు, శివాజీ గణేశన్ వంటి వారు కూడా సావిత్రి తో నటించాలంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే వారని అంటూ ఉంటారు.

మహానటి అనే ఒక బిరుదు తప్ప ఆమె పోయే వరకు ఎలాంటి బిరుదులు ఆమెను వరించలేదు.అంతేకాదు ఆమె వెళ్లేప్పుడు కూడా ఏమీ తీసుకుపోలేదు.1965లో ఉత్తమ తెలుగు సినిమాగా ఫిలిం అవార్డు అందుకున్న “చివరకు మిగిలేది” అనే చిత్రంలో సావిత్రి నటించింది.

Telugu Memorial, Savitri, Shivaji Ganesan, India, Sr Ntr, Sv Ranga Rao, Tollywoo

ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్న మహానటి సావిత్రి ఆమె కోమాలోకి వెళ్ళే ముందు మాత్రం ఒక కోరిక కోరిందట.ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె తన చివరి కోరికను సైతం బయటపెట్టిందట.తాను చనిపోయాక తన సమాధిపై ఏమని రాయాలో వివరించిందట.

మరణంలోనూ, జీవితంలోనూ ఒక మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వతమైన విశ్రాంతిని పొందుతుంది.ఇక్కడికి ఎవరొచ్చినా కూడా సానుభూతితో తమ కన్నీళ్ళని విడవనక్కర్లేదు.

ఈ ఇండస్ట్రీలో కూడా ఎవరు హీనంగా చూడకుండా మరణం లేని ఆ సమాధిలో నిద్రిస్తున్న మహా ప్రతిభకు చిహ్నంగా ఒక పూమాలను ఉంచండి….ఇదే మీరు నాకు ఇచ్చే గౌరవం.

అని సావిత్రి అన్నారట ఆమె మాటలను ప్రముఖ సినీ విమర్శకుడు నందగోపాల్ ఇటీవల తన ఒక ఇంటర్వ్యూలో వెలువరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube