దేవుడా.. పిల్లలకు తృటిలో తప్పిన పెను ప్రమాదం..

ప్రస్తుతం వానకాలం సమయం కాబట్టి దేశంలో పలు ప్రాంతాలలో అధిక వర్షాల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.తాజాగా పూణే నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే.

 A Big Danger For The Children That Was Narrowly Missed, Viral Video, Social Medi-TeluguStop.com

తాజాగా పూణే నగరంలో( Pune ) జరిగిన ఓ షాకింగ్ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.ఈ సంఘటనలో విద్యార్థులు ప్రయాణిస్తున్న అకస్మాత్తుగా ఒకసారిగా రోడ్డు పక్కన ఉన్న చెట్టు విరిగి పడిపోయింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

వైరల్ వీడియోలో గమనించినట్లయితే.ఓ రోడ్డుపై పలు వాహనాలు వెళుతూ ఉంటాయి.అయితే వర్షం కారణంగా రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టు ఆకస్మాత్తుగా ఒక్కసారిగా రోడ్డుపై కూలిపోయింది.

ఈ సంఘటనలో రోడ్డుపై వెళ్తున్న ఓ స్కూటీ మీద ప్రయాణిస్తున్న వ్యక్తిపై పడగా.ఆ వ్యక్తి కూడా ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకున్నాడు.చెట్టు స్కూటీని కింద పడేయగా అతనికి స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడు ప్రాణానికి ఎటువంటి అపాయం లేకుండా.అయితే అదే సమయంలో స్కూల్ సంబంధించిన వ్యాన్ పై పడింది.

అయితే ఈ సంఘటనలో అదృష్టం కొద్దీ వాహనం దెబ్బ తిన్నాకాని విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాలేదు.అందరూ సురక్షితంగానే బయటపడ్డారు.

పిల్లలు ప్రయాణం చేస్తున్న వాహనం కాస్త దెబ్బ తిన్న ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఇక పూణే నగరంలోని పింప్రి చించ్‌ వాడ్‌ లోని పలు నివాస ప్రాంతాలు జలమయం కాగా.భారీ వర్షాలకు సంబంధించి ఇప్పటివరకు 6 మంది మరణించినట్లు సమాచారం.పూణే జిల్లా అధికారులు అప్రమత్తమయి సహాయక చర్యలను వేగవంతం చేసి స్థానిక ప్రజలను ముంపు ప్రాంతాల నుంచి కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube