ఆరోగ్యాన్నిచ్చే ఆల్ బుఖారా.. వర్షాకాలంలో దొరికే ఈ పండ్లను మిస్ అయ్యారో చాలా నష్టపోతారు!

ప్రస్తుత వర్షాకాలంలో విరివిరిగా లభ్యమయ్యే పండ్లలో ఆల్ బుఖారా( All Bukhara ) ముందు వ‌రుస‌లో ఉంటుంది.ఎర్రటి రంగులో ఆపిల్ పండులా, ఆకారంలో ట‌మాటోలా ఉండే ఆల్ బుఖారా రుచి పరంగా మాత్రం కొంచెం వగరుగా మరికొంచెం పుల్లగా ఉంటుంది.

 Wonderful Health Benefits Of Eating Aloo Bukhara! Aloo Bukhara, Aloo Bukhara Hea-TeluguStop.com

పోషకాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్ మరియు కెరోటినాయిడ్ సమ్మేళనాలు( Carotenoid ) ఈ పండులో మెండుగా ఉంటాయి.

వర్షాకాలంలో ఆల్ బుఖారా పండ్లను తినడం మిస్సయ్యారో చాలా నష్టపోతారు.ఎందుకంటే, ఆల్ బుఖారా పండ్లు మ‌న ఆరోగ్యాన్ని పెంచ‌డానికి ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి.

ఆల్ బుఖారా పండులో విటమిన్ కె, కాపర్, పొటాషియం ( Vitamin K, Copper, Potassium )మరియు కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి.ఇవి ఎముక ఖనిజ సాంద్రతను పెంచుతాయి.

ఎముక‌ల‌ను బ‌లోపేతం చేస్తాయి.అలాగే ఆల్ బుఖారా యాంటీ-డయాబెటిక్ లక్షణాలను క‌లిగి ఉంటుంది.

ఆల్ బుఖారా పండ్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని గణనీయంగా తగ్గిస్తాయని ఒక అధ్యయనం కనుగొంది.కాబ‌ట్టి మ‌ధుమేహం ఉన్న‌వారు మితంగా ఈ పండును తీసుకుంటే చాలా మంచిది.

Telugu Aloobukhara, Aloo Bukhara, Tips, Latest-Telugu Health

ఆల్ బుఖారా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.అదే స‌మ‌యంలో రక్తం యొక్క నాణ్యత మరియు ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.గుండెను ఆరోగ్యంగా( Heart healthy ) ఉంచడంలో సహాయపడుతుంది.ఆల్ బుఖారాలో ఉండే ప‌లు స‌మ్మేళనాలు ప్రేగు కదలికలను నిర్వహించడానికి మరియు సాఫీగా ప్రవహించటానికి తోడ్ప‌డ‌తాయి.ఆల్ బుఖారాలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును పెంచుతుంది.మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌ను దూరం చేస్తుంది.

Telugu Aloobukhara, Aloo Bukhara, Tips, Latest-Telugu Health

అంతేకాదు ఆల్ బుఖారా పండ్ల‌లో ఉండే శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్తిస్తాయి.దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి.ఇక ఆల్ బుఖారా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉన్నా కూడా త‌గ్గుముఖం ప‌డుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube