ఒక మచ్చ కూడా లేకుండా ముఖ చర్మం సూపర్ గ్లోయింగ్ గా, షైనీ గా( Glowing, shiny ) మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.అయితే అటువంటి చర్మాన్ని పొందడం అంత సులభం కాదని భావిస్తుంటారు.
సులభం కాకపోవచ్చు కానీ సాధ్యమే.స్పాట్ లెస్ స్కిన్ ను మీ సొంతం చేయడానికి ఒక న్యాచురల్ ఫేస్ వాష్ ఉంది.
ఈ ఫేస్ వాష్ ను కనుక రెగ్యులర్ గా వాడితే అదిరిపోయే స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.మరి ఇంతకీ ఆ ఫేస్ వాష్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వేపాకు, పది పుదీనా ఆకులు( Neem , mint leaves ) వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ), వన్ టేబుల్ స్పూన్ హనీ( Honey ), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి.

అలాగే ఒక కప్పు వేప-పుదీనా జ్యూస్ మరియు అర కప్పు మెల్ట్ చేసుకున్న సూప్ బేస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన ఫేస్ వాష్ అనేది సిద్ధమవుతుంది.ఒక బాటిల్ లో ఈ న్యాచురల్ ఫేస్ వాష్ ను నింపుకొని స్టోర్ చేసుకోవాలి.
రోజు ఈ ఫేస్ వాష్ ను ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

రెగ్యులర్ గా ఈ న్యాచురల్ ఫేస్ వాష్ ను వాడితే ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్నా మాయం అవుతాయి.మొటిమలు సమస్య తగ్గు ముఖం పడుతుంది.చర్మ కణాలు లోతుగా శుభ్రం అవుతాయి.
చర్మం కాంతివంతంగా మారుతుంది.స్పాట్ లెస్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను కోరుకునే వారికి ఈ న్యాచురల్ ఫేస్ వాష్ చాలా అంటే చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
కాబట్టి తప్పకుండా దీనిని తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.