ఈ న్యాచురల్ ఫేస్ వాష్ ను వాడితే స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతమవుతుంది!

ఒక మచ్చ కూడా లేకుండా ముఖ చర్మం సూపర్ గ్లోయింగ్ గా, షైనీ గా( Glowing, Shiny ) మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

అయితే అటువంటి చర్మాన్ని పొందడం అంత సులభం కాదని భావిస్తుంటారు.సులభం కాకపోవచ్చు కానీ సాధ్యమే.

స్పాట్ లెస్ స్కిన్ ను మీ సొంతం చేయడానికి ఒక న్యాచురల్ ఫేస్ వాష్ ఉంది.

ఈ ఫేస్ వాష్ ను కనుక రెగ్యులర్ గా వాడితే అదిరిపోయే స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.

మరి ఇంతకీ ఆ ఫేస్ వాష్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వేపాకు, పది పుదీనా ఆకులు( Neem , Mint Leaves ) వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న‌ మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe Vera Gel ), వన్ టేబుల్ స్పూన్ హనీ( Honey ), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి.

"""/" / అలాగే ఒక కప్పు వేప-పుదీనా జ్యూస్ మరియు అర కప్పు మెల్ట్ చేసుకున్న సూప్ బేస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

తద్వారా మన ఫేస్ వాష్ అనేది సిద్ధమవుతుంది.ఒక బాటిల్ లో ఈ న్యాచురల్ ఫేస్ వాష్ ను నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

రోజు ఈ ఫేస్ వాష్ ను ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. """/" / రెగ్యులర్ గా ఈ న్యాచురల్ ఫేస్ వాష్ ను వాడితే ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్నా మాయం అవుతాయి.

మొటిమలు సమస్య తగ్గు ముఖం పడుతుంది.చర్మ కణాలు లోతుగా శుభ్రం అవుతాయి.

చర్మం కాంతివంతంగా మారుతుంది.స్పాట్ లెస్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను కోరుకునే వారికి ఈ న్యాచురల్ ఫేస్ వాష్ చాలా అంటే చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

కాబట్టి తప్పకుండా దీనిని తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

వాలంటీర్ల కొనసాగింపు పై చంద్రబాబు ప్రభుత్వం క్లారిటీ