మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి నెల అమావాస్య పౌర్ణమిలు వస్తుంటాయి.ఈ క్రమంలోనే భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమిని మహాలయ పౌర్ణమి అని పిలుస్తారు.
ఈ మహాలయ పౌర్ణమి నుంచి మహాలయ పక్షం ప్రారంభమవుతుంది.ఈ రోజు నుంచి వరుసగా పదిహేను రోజుల వరకు పితృదేవతలకు విశేషమైన పూజలు చేయడం వల్ల ఈ 15 రోజులను పితృపక్షం అని పిలుస్తారు.
ఎంతో పవిత్రమైన ఈ పితృ పక్షాలలో ప్రతి ఒక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో తమ పూర్వీకులకు, తమ వంశంలో చనిపోయిన పెద్దవారికి పిండ ప్రధానం చేయటం వల్ల వారి కోరికలు నెరవేరి వారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెబుతున్నారు.
భాద్రపద మాసం కృష్ణ పక్షంలో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి.
ఈ పక్షంలో అనగా ఈ పదిహేను రోజులలో ఏదో ఒక రోజు మనం మన పెద్దవారిని స్మరించుకుంటూ వారికి పూజ చేయాలి.ఈ విధంగా పూజ చేయటం వల్ల మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయి ఉంటారో అలాంటి వారు ఈ పదిహేను రోజులలో ఒక రోజు ఉదయం నదీ స్నానాన్ని ఆచరించి అక్కడ ఉన్నటువంటి ఆలయంలో మన పెద్దలకు శార్ధం పెట్టాలి.

ఈ విధంగా మన పెద్దలకు మహాలయ పక్షంలో పూజలు చేయటం వల్ల మనం ఎలాంటి లాభాలు కలుగుతాయి అని చాలామందికి సందేహాలు తలెత్తుతుంటాయి.అయితే చాలా మంది దంపతులకు పెళ్లయిన ఎన్ని రోజులకు సంతానం కలగదో అలాంటి వారికి పితృ దోషం ఉండటం వల్ల సంతానం కలగదని పండితులు చెబుతున్నారు.ఇలాంటి వారు మహాలయ పక్షంలో పితృదేవతలకు శార్ధం పెట్టడం వల్ల ఈ విధమైనటువంటి దోషాలు తొలగిపోతాయి.ఇలా పెద్దలకు శార్ధం పెట్టిన తర్వాత వాటిని జలచరాలకు, కాకులకు లేదా గ్రద్దలకు పెట్టడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు.
అలాగే మన పితృ దేవతల పేర్ల పై అన్నదానం, వస్త్ర దానం చేయటంవల్ల పితృ దోషాలు తొలగిపోతాయి.కనక ఈ పదిహేను రోజులలో ఏదో ఒక రోజు పితృదేవతలకు పూజ చేయటం ఎంతో శుభసూచికం.