రోడ్డు నెట్‌వర్క్‌లు( Road Networks ) అనేవి ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకంగా ఉంటాయి.ప్రజలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణించడానికి, వస్తువులను రవాణా చేయడానికి రోడ్డు నెట్‌వర్క్‌లు అత్యంత ముఖ్యమైనవి.
అయితే ఇండియా ( India ) ప్రపంచంలోని అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌లు కలిగి ఉన్న దేశాల్లో సెకండ్ ప్లేస్ సంపాదించింది.చైనాని( China ) వెనక్కి నెట్టి ఈ స్థానాన్ని భారత్ సొంతం చేసుకుంది.ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
1.యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.ఈ దేశంలో మొత్తం 6,803,479 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించారు.వాటిలో 63% తారు రోడ్లు కాగా, 37% మట్టి, కంకర రోడ్లు ఉన్నాయి.1956లో ఫెడరల్-ఎయిడ్ హైవే యాక్ట్ అనే చట్టాన్ని ఆమోదించిన తర్వాత US తన రోడ్ నెట్‌వర్క్‌లో గమనించదగిన స్థాయిలో మెరుగుదలలు చేసింది.
2.భారతదేశం మొత్తం 6,372,613 కిలోమీటర్ల రోడ్లతో రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.ఈ రోడ్లలో దాదాపు 70% తారు రోడ్లు కాగా, 30% చదును చేయని రోడ్లు ఉన్నాయి.ఇండియా 2015 ఏడాది నుంచి రోడ్డు నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు కృషి చేస్తోంది.2015లో మన దేశం దాదాపు 5,400,000 కిలోమీటర్ల మేర రోడ్లు కలిగి ఉంది.కాగా నేటికి ఆ రోడ్ల విస్తరణ దాదాపు పది లక్షలు పెరిగింది.
3.5,198,000 కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న చైనా జాబితాలో మూడవ స్థానంలో ఉంది.దాని రోడ్లలో ఎక్కువ భాగం, దాదాపు 95% తారు లేదా ఇతర మెటీరియల్స్ తో నిర్మితమయ్యాయి.మిగిలిన 5% చదును చేయలేదు.
4.బ్రెజిల్ మొత్తం 2,000,000 కిలోమీటర్ల రోడ్లతో ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.వీటిలో 12% మాత్రమే రోడ్లు వేయబడ్డాయి, మెజారిటీ 88% రోడ్లను చదును చేయలేదు.
5.1,529,373 కిలోమీటర్ల రహదారి నెట్‌వర్క్‌తో రష్యా ఐదవ స్థానాన్ని ఆక్రమించింది.వీటిలో దాదాపు 61% రోడ్లు చదును చేయగా, 39% చదును చేయలేదు.