కాలం ఎంత మారుతున్నా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో బాల్య వివాహాలు జరుగుతున్నాయి.ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లీదండ్రులు ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
బాలికల విద్యకు తోడ్పాటు అందిస్తే ఉన్నత స్థాయిలో రాణిస్తారని బానోతు కుసుమ కుమారి( Banothu kusuma kumari ) సక్సెస్ స్టోరీతో ప్రూవ్ అయింది.ఇంటర్( Telangana Inter Results 2024 ) లో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన ఈమె సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradri Kothagudem )లోని మారుమూల గ్రామంలో జన్మించిన కుసుమ ఆడపిల్లలంటే చిన్నచూపుగా భావించే ప్రాంతంలో పెరిగారు.తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో పరిస్థితులు అర్థమైన తర్వాత సొంతంగా తన కాళ్ల మీద తాను నిలబడాలని కుసుమ భావించారు.కష్టపడి చదివి కుసుమ మంచి మార్కులు సాధించినా కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల వల్ల ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

14 సంవత్సరాలకే నాకు పెళ్లి చేయడానికి ఇంట్లో వాళ్లు ప్రయత్నించారని నా మనస్సు మాత్రం అందుకు అంగీకరించలేదని ఆమె తెలిపారు.ఎలాగైనా ఆ గండం నుంచి బయటపడాలని చైల్డ్ లైన్ కు ఫిర్యాదు చేశానని కుసుమ పేర్కొన్నారు.సమాచారం తెలుసుకున్న అధికారులు కుసుమ తల్లీదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పెళ్లిని ఆపేయడం జరిగింది.
నేను బాగా చదువుకుని నర్సుని అవ్వాలని అనుకుంటున్నానని అధికారులకు చెప్పగా మణుగూరులోని చిల్డ్రన్స్ హోమ్ కు పంపించారని ఆమె పేర్కొన్నారు.ఆ తర్వాత నన్ను కేబీవీపీలో చేర్పించారని కుసుమ చెప్పుకొచ్చారు.
ఇంటర్ లో 978 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచానని ఆమె అన్నారు.కుసుమ సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
బానోతు కుసుమ కుమారిలా బాల్య వివాహాలను ఎదురించి కెరీర్ పై ఫోకస్ పెడితే ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.