పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ‘బ్రో’ చిత్రం( Bro Movie ) వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.తమిళం లో రూపొంది సూపర్ హిట్ అయినా వినోదయ సీతం సినిమా కు ఇది రీమేక్.
ఈ సినిమా రీమేక్ అనే ప్రచారం జరుగుతుంది కానీ దర్శకుడు త్రివిక్రమ్( Director Trivikram ) మరియు రచయిత సాయి మాధవ్ బుర్ర లు కథలో చాలా మార్పులు చేసి స్క్రీన్ ప్లే కొత్తగా చూపించారట.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇమేజ్ కి తగ్గట్టుగా ఈ సినిమా ను మార్చినట్లు చెబుతున్నారు.పవన్ ఈ సినిమా కోసం రోజుకు రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు స్వయంగా ఆయనే వెల్లడించాడు.20 నుండి 25 రోజుల పాటు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ వర్క్ చేశాడు.

మరో ఐదు నుండి ఏడు రోజుల పాటు షూటింగ్ మరియు ప్రమోషన్ కార్యక్రమాలకు పాల్గొనబోతున్నాడు.ఈ సినిమాతో ఆయనకు భారీగా పారితోషకం దక్కింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు దాదాపుగా 125 కోట్ల రూపాయలను ఖర్చు చేశారట.ఇక పవన్ కళ్యాణ్ కి ఉన్న బ్రాండ్ ఇమేజ్.
పైగా ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కూడా నటించడం వల్ల సినిమా కి హైప్ భారీగా పెరిగి థియేట్రికల్ రైట్స్ మరియు నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి ఏకంగా 175 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.అందుకే ఈ సినిమాను భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు బయ్యర్లు క్యూ కట్టారట.అందుకే ఈ సినిమాతో పీపుల్స్ మీడియా వారు భారీ మొత్తంలో విడుదలకు ముందే లాభాలను దక్కించుకున్నారు అంటూ యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది.సినిమా విడుదల తర్వాత సక్సెస్ అయితే కలెక్షన్ ఈజీగా రూ.200 కోట్లు నమోదయ్యే అవకాశం ఉంది.అప్పుడు నిర్మాతలకు మరో రూ.50 కోట్ల లాభం చేకూరే అవకాశం ఉంది అంటే మొత్తంగా 100 కోట్ల రూపాయలు పీపుల్స్ మీడియా వారు ఒక్క సినిమాతోనే దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది.
