జుట్టు రోజురోజుకు పల్చబడుతుందా.. అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే..!

జుట్టు విపరీతంగా రాలిపోతుందా.? ఎంత కేర్ తీసుకున్న కురులు రాలడం ఆగడం లేదా.? రోజు రోజుకు జుట్టు పల్చగా మారిపోతుందా.‌.? అయితే కచ్చితంగా మీరు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ గురించి తెలుసుకోవాల్సిందే.ఈ రెమెడీ జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టడమే కాకుండా పల్చగా మారిన కురులను మళ్లీ దట్టంగా మార్చడంలో సహాయపడుతుంది.

 Boost Your Hair Growth With This Home Remedy! Home Remedy, Hair Growth, Hair Car-TeluguStop.com

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల మెంతులు( fenugreek ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఒక కలబంద ఆకు తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ బాగా బాయిల్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ) వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆపై అందులో నైట్ అంతా నానబెట్టుకున్న మెంతులు మరియు కలబంద ముక్కలు( Aloe vera pieces ) కూడా వేసి మరొక ఐదారు నిమిషాల పాటు ఉడికించాలి.దాంతో వాటర్ అనేది జెల్లీ గా మారుతుంది.

Telugu Boost, Boostremedy, Care, Care Tips, Healthy, Thick, Thin-Telugu Health

స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక ఈ జెల్ లో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, అరకప్పు కొబ్బరి పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Telugu Boost, Boostremedy, Care, Care Tips, Healthy, Thick, Thin-Telugu Health

వారానికి ఒకసారి ఈ మాస్క్ ను కనుక వేసుకుంటే జుట్టు మూలాల నుంచి బలోపేతం అవుతుంది.దాంతో జుట్టు రాలడం, విరగడం వంటి సమస్యలు తగ్గుతాయి.అలాగే ఈ మాస్క్ కొత్త జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.ఊడిన జుట్టును మళ్ళీ మొలిపించి.కురులను ఒత్తుగా మారుస్తుంది.అంతేకాకుండా ఈ మాస్క్ జుట్టులో తేమను నిలుపుతుంది.

కురులకు కొత్త మెరుపును జోడిస్తుంది.షైనీ గా మెరిసేలా చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube