వెండి తెరపై తేడా వేషంలో అదరగొట్టిన హీరోలెవరో తెలుసా?

ప్రముఖ గాయకురాలు ఎస్ జానకి.పదే పదే ఓ మాట చెప్తుంది.

 Tollywood Heros Who Made Character Very Special, Raghava Lawrence, Ram Poteneni,-TeluguStop.com

సింగర్ అన్నాక అన్ని పాటలు పాడాలంటుంది.నేను పలానా పాటలే పాడుతాను అని కండీషన్ పెట్టకూడదు అంటుంది.

భక్తి పాటలే కాదు.రక్తి పాటలు కూడా పాడాలంటుంది.

అప్పుడే సంపూర్ణ గాయకులుగా మారుతారంటుంది.సేమ్ అలాగే సినిమా నటీనటుల విషయంలోనూ ఈ సూత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఏ క్యారెక్టర్ ఇచ్చినా అందులో లీనమై పోవాలి.అంతే తప్ప నేను పలనా క్యారెక్టర్లు మాత్రమే చేస్తాను అనే కండీషన్లు ఉండకూడదు.

పలువురు టాలీవుడ్ యంగ్ హీరోస్ పలు ఛాలెంజింగ్ రోల్స్ చేసి వారెవ్వా అనిపించారు.కొంత మంది విలన్లుగా మారితే.మిరికొందరు తేడా గెటప్ లో అదరగొట్టారు.సీనియర్ నటుడు ఎన్టీఆర్ నుంచి మొదలైన ఈ తరహా పాత్రలు ప్రస్తుత జనరేషన్ లోనూ కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ జెనరేషన్ హీరోల్లో తేడా పాత్రలు పోషించి ఆకట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు.ఇంతకీ వారెవరో ఇప్పుడు చూద్దాం.

రాఘవ లారెన్స్

Telugu Heroscharacters, Nagarya, Ram Poteneni-Telugu Stop Exclusive Top Stories

ప్రస్తుత జనరేషన్ లో తేడా పాత్రలు వేయడం మొదలు పెట్టింది రాఘవ లారెన్స్ అని చెప్పుకోవచ్చు.పలు హార్రర్ సినిమాల్లో ఆయన ఈ వేషం వేసి అదరగొట్టారు.హారర్ సినిమాలకు కామెడీ జోడించి అద్భుత సినిమాలు చేశాడు.కాంచన సినిమాల సిరీస్ తో అందరినీ అలరించాడు.దాదాపు ఆయన తేడా క్యారెక్టర్ తో చేసిన సినిమాలన్నీ విజయాన్ని అందుకున్నాయి.ఇదే తరహా సినిమాలు చేసిన పలువురు ఫిల్మ్ మేకర్స్ కొంత మేరకు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు.

రామ్ పోతినేని

Telugu Heroscharacters, Nagarya, Ram Poteneni-Telugu Stop Exclusive Top Stories

క్లాలస్ హీరో రామ్ కూడా ఓ తేడా క్యారెక్టర్ చేశాడు.మసాలా సినిమాలో తను ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం.ఆమె అన్నయ్యకు దగ్గరయ్యేందుకు ఈ క్యారెక్టర్ చేస్తాడు.ఈ పాత్రలో రామ్ బాగానే యాక్ట్ చేసినా.సినిమా మాత్రం అంతగా ఆడలేదు.

నాగశౌర్య

Telugu Heroscharacters, Nagarya, Ram Poteneni-Telugu Stop Exclusive Top Stories

మరో యంగ్ హీరో నాగశౌర్య కూడా నర్తనశాల సినిమాలో తేడా పాత్ర చేశాడు.గతంలో సీనియర్ ఎన్టీఆర్ సైతం ఇదే పేరుతో వచ్చిన సినిమాలో తేడా పాత్ర చేశాడు.ఆ సినిమా మంచి విజయం సాధించింది.

కానీ నాగశౌర్య సినిమా మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు.కామెడీ పరంగా ఫర్వాలేదు అనిపించొంది.

బెల్లంకొండ శ్రీనివాస్

Telugu Heroscharacters, Nagarya, Ram Poteneni-Telugu Stop Exclusive Top Stories

బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఈ తరహా పాత్ర చేశాడు.అల్లుడు అదుర్స్ సినిమాలో తేడా క్యారెక్టర్ పోషించాడు.అయితే ఈ క్యారెక్టర్ ను జనాలు అంతగా రిసీవ్ చేసుకోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube