ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య మళ్లీ కృష్ణా జలాల వివాదం తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ విషయంపై తెలంగాణ మంత్రులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై చేస్తున్న ప్రాజెక్టుల నిర్మాణం అక్రమమైనవని మొన్న జరిగిన కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ ఖండించారు.వాటిపై కోర్టులో పోరాడాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో ఇదే సందుగా తెలంగాణ మంత్రులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
మొన్నటికి మొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మంత్రి ప్రశాంత్‌రెడ్డి కలిసి దివంగత సీఎం వైయస్‌ను దొంగని, జగన్‌ను గజదొంగ అని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇదే విషయంపై ఏపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఇప్పటికే వైసీపీకి చెందిన కీలక నేతలు చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు రోజా, రవీంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్లు మంత్రి ప్రశాంత్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు.
మంత్రిపై ఘాటు కామెంట్లు చేస్తూ దుమారం రేపుతున్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందిస్తూ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు.
కాకపోతే ఆ వివరణలో కూడా దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ను తిట్టారు.

ఆయన్ను తెలంగాణ వ్యతిరేకిగా వర్ణిస్తూ విద్యార్థుల చావులకు ఆయనే కారణమని, ఆయన ఓ రాక్షసుడని సంచలన కామెంట్లు చేశారు మంత్రి.దీంతో వివాదం కాస్త ముదిరింది.ఈ వ్యాఖ్యలపై ఏపీకి చెందిన సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన తీవ్రమైన వ్యాఖ్యలను గాను ఆయన నాలుకను కోసేయాలని చెప్పడం పెద్ద దుమారపే రేపుతోంది.తిట్టుకుంటే నీళ్లు రావని, కూర్చుని పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు.
మరి ఈ వ్యాఖ్యలపై మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.మొత్తానికి నీళ్ల పంచాయితీ కాస్తా ప్రభుత్వాల మధ్య, ఇటు నేతల మధ్య చిచ్చు పెట్టేలాగే కనిపిస్తోంది.