శంకరాభరణం సీక్వెల్ ఆలోచన వల్ల భంగపడ్డ కళాతపస్వి

శంకరాభరణం సినిమా విజయం ఖండాంతరాలు దాటి ప్రతి ఒక్కరిని పరవశింప చేసింది.ఈ సినిమా తీయడం వెనక విశ్వనాథ్ గారి ఉద్దేశ్యం ఒక్కటే.

 Swarabhishekam Movie Effect On K Vishwanath ,swarabhishekam,  K Vishwanath, Srik-TeluguStop.com

వాట్సాప్ సంగీతానికి శాస్త్రీయ సంగీతానికి మధ్య ఉన్న ఆ గీతని స్పష్టంగా చూపించదలచుకొని ఈ సినిమాను తీశారు.విశ్వనాధ్ గారు ఈ సినిమా తర్వాత కూడా ఎన్నో మంచి హిట్ సినిమాలను డైరెక్ట్ చేశారు.

అలాగే ఫ్లాప్ సినిమాలు కూడా తీసినప్పటికీ అవి వారి కెరియర్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు.ఇక ఎక్కువ శాతం సినిమాలో ఆయన నృత్యం లేదా సంగీతం, పాటలు వంటి సబ్జెక్ట్ ని ఎంచుకొని చేయడం వల్ల ఆయన చరిత్ర ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

Telugu Dance, Vishwanath, Laya, Music, Srikanth, Subhapradam, Swarabhishekam, To

కానీ ఆయన జీవితంలో ఎన్నో ఫ్లాప్ సినిమాలు తీసినప్పటికీ సీక్వెల్ సినిమాలు తీయాలని ఏ రోజు అనుకోలేదు.కానీ కొన్ని కారణాల వల్ల ఆ శంకరాభరణం లాంటి మరొక సినిమా తీయాలని ఆయనకు ఎప్పుడూ ఉండేది.శ్రీకాంత్ హీరోగా, లయ లీడ్ హీరోయిన్ గా, విశ్వనాధ్ గారు కూడా స్వయంగా నటించి ఒక సినిమాను తీశారు.ఆ సినిమా పేరు స్వరాభిషేకం.శంకరాభరణం వంటి ఒక సినిమాకి దీన్ని సీక్వెల్ అని అనిపించే విధంగానే తీశారు.కానీ అప్పటి సంగీతానికి ఇప్పటి సంగీతానికి అలాగే అప్పటి కథలకు, చూసే ప్రేక్షకులకు, ఇప్పటి యువతకు పొంతన లేదు.

దాంతో సినిమా దాదాపుగా ఆయన పరువు పోగొట్టే విధంగానే వచ్చింది.

Telugu Dance, Vishwanath, Laya, Music, Srikanth, Subhapradam, Swarabhishekam, To

ఆధునిక పోకడలను ఆయన జీర్ణించుకోకపోవడం, అలాగే పాత మూసను మళ్లీ కొనసాగించడం వంటి కారణాలతో ఆయన చివరి దశలో తీసిన సినిమాలు పరాజయం పొందడంతో దర్శకత్వం నుంచి ఆయన శాశ్వత విరామం ప్రకటించారు.స్వరాభిషేకం సినిమా కన్నా ముందు అల్లరి నరేష్ ని పెట్టి శుభప్రదం అనే ఒక సినిమాను కూడా తీశారు.ఇది కూడా దాదాపుగా విశ్వనాధ్ గారి స్థాయికి ఒక్క శాతం కూడా రీచ్ కాలేకపోయింది.

దాంతో సినిమాలు చేయకూడదని భావించుకొని యాక్టింగ్ మాత్రం కొన్నాళ్లపాటు కొనసాగించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube