ఒకప్పుడు హీరోలు అంటే కేవలం హీరో పాత్రలు మాత్రమే చేసేవారు.కానీ ఇటీవల కాలంలో మాత్రం హీరోలు కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్లుగా కూడా నటిస్తూ తమ నటనతో మెప్పిస్తూ ఉన్నారు అని చెప్పాలి.
అయితే ఒక సినిమాలో ఒక నటుడు హీరోగా లేదా విలన్ గా నటించడం చూస్తూ ఉంటాం.కానీ ఒకే నటుడు ఒక సినిమాలో హీరోగా విలన్ గా రెండు రకాల పాత్రలు చేయడం అంటే చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.
ఇలాంటి అరుదైన సినిమాల్లో నటించిన హీరోలు కొంతమంది ఉన్నారు అని చెప్పాలి.
జూనియర్ ఎన్టీఆర్ : అద్భుతమైన నటనకు నిలువెత్తు రూపం ఈ నందమూరి వారసుడు.అయితే జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమాలో హీరోగా విలన్ గా కూడా తానే నటించి తన నటనతో మెప్పించాడు.ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

విక్రమ్ : తమిళ హీరో విక్రమ్ సైతం ఇలా తన సినిమాలో హీరోగా విలన్ గా రెండు పాత్రల్లో నటించాడు.ఇక ఎప్పుడు వైవిధ్యమైన సినిమాలు తీస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు విక్రమ్.ఇంకొకడు సినిమాలో విలన్ గా మరియు హీరోగా నటించిన అదరగొట్టేసాడు.

సూర్య : పవర్ఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతూ ఉంటాడు హీరో సూర్య.అయితే సూర్య కెరియర్ లో దిపాత్రాభినయం చేసిన సినిమాలు చాలా తక్కువ.అయితే సూర్యకేరియర్ లో ఇలా ద్విపాత్రాభినయంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమా 24.
ఈ సినిమాలో విలన్ గా హీరోగా కూడా సూర్య నటించి తన నటనతో మెప్పించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

బాలకృష్ణ : ఎన్టీఆర్ నట వారసత్వాన్ని ఇండస్ట్రీలో కొనసాగిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ సైతం అప్పుడప్పుడు తన సినిమాలతో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు.ఈ క్రమంలోనే సుల్తాన్ సినిమాలో హీరోతో పాటు విలన్ పాత్రలో కూడా తానే నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
గోపీచంద్ : విలన్ గా కెరియర్ మొదలుపెట్టి హీరో అయిన వారిలో గోపీచంద్ ముందు వరుసలో ఉంటాడు.అయితే గౌతమ్ నంద అనే సినిమాలో తానే హీరో విలన్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు.ఇలా కేవలం కొంతమంది హీరోలు మాత్రమే ఇండస్ట్రీలో తమ సినిమాల్లో హీరో విలన్ పాత్రలను ఒక్కరే పోషించి ప్రేక్షకులను అబ్బురపరిచారు అని చెప్పాలి.