ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.38
సూర్యాస్తమయం: సాయంత్రం 05.37
రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు
అమృత ఘడియలు: ఉ.ఆరుద్ర సా.4.00 ల6.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వలన భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.
మిథునం:

ఈరోజు మీరు సమాజంలో మంచి గౌరవ మర్యాదలను అందుకుంటారు.ఇతరుల చెప్పిన మాటలు పట్టించుకోరు.మీ బంధువుల నుండి శుభవార్త వింటారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల గురించి ఆలోచిస్తారు.ధైర్యంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.
కర్కాటకం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు ఎంతో అవసరం.అనుకోకుండా ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.
సింహం:

ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట సహాయం చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
కన్య:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
తులా:

ఈరోజు మీరు మీ సొంత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు తల్లిదండ్రుల సలహాలు తీసుకోవడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కలిసి సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి వారితో చర్చలు చేస్తారు.
వృశ్చికం:

ఈరోజు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో ఇతరుల సహాయం అందుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వలన మనశ్శాంతి కలుగుతుంది.
ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనారోగ్య సమస్యతో బాధ పడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుట పడుతుంది.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.దూర ప్రాణాలు బాగా కలిసి వస్తాయి.
మకరం:

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో తీరికలేని సమయంతో గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు.
అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి.కొన్ని దూర ప్రయాణానికి ఇబ్బంది కలిగిస్తాయి.
కుంభం:

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాల బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కొన్ని పూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాల్సి ఉంటుంది.మీరు పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాలు తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.