ఈమధ్య కాలంలో చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగం( Govt job ) కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.అలాగే గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ఎన్నో పరీక్షలు రాసి ఇబ్బందులు పడుతూ ఉంటారు.
అయితే కొంతమంది ఎంత ప్రయత్నించినా వాళ్ళు అనుకున్న గమ్యానికి చేరుకోలేరు.దీనికి కారణం జన్మతహ దోషాలు ఉంటాయని వేద పండితులు సూచిస్తున్నారు.
అందుకే వాటికి పరిహారం చేసుకోవడం వల్ల గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు.
అయితే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఆంజనేయుడుకి మల్లె పువ్వుల నూనెతో( jasmine flower oil ) దీపాలు పెడితే తమ కోరిక నెరవేరుతుందని పురాణాలు చెబుతున్నాయి.
అయితే ఆంజనేయుడికి( Anjaneya ) ఆ దీపం ఎలా పెట్టాలో? ఎలా పూజించాలో? ఇప్పుడు తెలుసుకుందాం.గవర్నమెంట్ ఉద్యోగం కోసం చాలామంది పరతపిస్తూ ఉంటారు.
అయితే అదృష్టం ఉన్న వారికి మాత్రం అవకాశం కలుగుతుంది.అయితే అవకాశం మనకి కలిగేంత వరకు హనుమంతుడు మన వెనుక నిలుస్తాడు.
అందుకే దీని కోసం ప్రయత్నించే వారికి చాలా ధైర్యం కావాల్సి ఉంటుంది.అందుకే ఆంజనేయుడికి మల్లెపూల దీపం పెట్టడం వలన మనకి కొండంత బలం వస్తుంది.

మనోధైర్యం, నిబ్బరం కలుగుతుంది.దీని కోసం శనివారం లేదా మంగళవారం రోజున దీపం పెట్టుకోవాలి.ఇలా దీపం పెట్టాలని అనుకున్నవారు రోజు ఇల్లు, వాకిలిని చాలా శుభ్రం చేసుకోవాలి.అలాగే పూజా మందిరాన్ని గోవు మూత్రంతో కానీ లేదా గోమయంతో కానీ పవిత్రం చేయాలి.
అలాగే కుబేర ముగ్గు వేసి ఆ తర్వాత పీఠం వేసి శ్రీరాముడి పటాన్ని ఉంచాలి.ఇక ఆ తర్వాత రాముడికి ఎదురుగా మరొక పీఠాన్ని వేయాలి.ఆ తర్వాత ఆంజనేయుడి విగ్రహం కానీ పటమును కానీ ఉంచుకోవాలి.

ఇక ఈ పటాలకు పసుపు, కుంకుమ, పళ్ళు, పూలను సమర్పించాలి.ఇక దేవుడు ముందు దీపం పెట్టడానికి రెండు మట్టి ప్రమీదలను తీసుకోవాలి.ఆ ప్రమీదలకు పసుపు పూసి బొట్టు పెట్టి ఒకదానిపై ఒకటిని ఉంచాలి.
ఇక అందులో మల్లెపువ్వు నూనె వేసి తొమ్మిది వత్తులు పెట్టి దీపం వెలిగించాలి.ఇక ఆ తర్వాత శ్రీరామ నామ జపాన్ని ఆంజనేయస్వామి అష్టోత్తర నామాన్ని జపిస్తూ ఉండాలి.
అలా జపిస్తూ మన కోరికను అర్జించుకోవాలి.ఇలా తొమ్మిది వారాలపాటు చేస్తే మన కోరిక స్వామి వారు తప్పక నెరవేరుస్తారు.