మహిళలు కచ్చితంగా తినాల్సిన లడ్డూ.. నడుము నొప్పి, రక్తహీనత మరెన్నిటికో మెడిసిన్ ఇది!

మొదటి నెలసరి ప్రారంభం అయినప్పటి నుంచి ఆడ‌వారు శారీరకంగా ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తుంటారు.నడుము నొప్పి, రక్తహీనత( Anemia ), నీరసం, హార్మోన్ల అసమతుల్యత వంటివి ప్రధానంగా వేధిస్తుంటాయి.

 Eating This Laddu Is Very Good For Women's Health! Laddu, Healthy Laddu, Latest-TeluguStop.com

వీటికి చెక్ పెట్టాలంటే డైట్ లో కొన్ని ప్రత్యేక ఆహారాలను కచ్చితంగా చేర్చుకోవాలి.అటువంటి ఫుడ్స్ లో ఇప్పుడు చెప్పబోయే లడ్డూ కూడా ఒకటి.

మహిళలు ఎదుర్కొనే అనేక సమస్యలకు ఈ లడ్డూ ఒక న్యాచురల్ మెడిసిన్ లా పనిచేస్తుంది.మరి ఇంతకీ ఆ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Healthy, Healthy Laddu, Laddu, Latest-Telugu Health

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక కప్పు వాల్ నట్స్ వేసుకుని మంచిగా వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు అటుకులు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న అటుకులు వేసి బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి.ఆ తర్వాత అదే మిక్సీ జార్‌లో వాల్ నట్స్( Walnuts ) మరియు ఒక కప్పు బెల్లం తురుము వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

చివరిగా అటుకుల పొడిని కూడా వేసి మరోసారి మిక్స్ చేసుకోవాలి.</b

Telugu Tips, Healthy, Healthy Laddu, Laddu, Latest-Telugu Health

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ల‌డ్డూల మాదిరి చుట్టుకుని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ అటుకుల వాల్ నట్ ల‌డ్డూ తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది.అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా ఈ లడ్డూలో ఉండే కాల్షియం, మెగ్నీషియం( Calcium, magnesium ) వంటి పోషకాలు ఎముకలను బలోపేతం చేస్తాయి.నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి వంటి వాటికి చెక్ పెడతాయి.

అలాగే ఈ లడ్డూలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.అందువల్ల అమ్మాయిలు రోజుకు ఒకటి చొప్పున ఈ లడ్డూను తీసుకుంటే రక్తహీనతకి దూరంగా ఉండవచ్చు.

అంతేకాదు ఈ లడ్డూను డైట్ లో చేర్చుకుంటే నీరసం అలసట వేధించకుండా ఉంటాయి, మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.హార్మోన్లు సమతుల్యం అవుతాయి.

మరియు ఈ లడ్డూ గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.కాబట్టి మహిళలు తప్పకుండా ఈ హెల్తీ లడ్డూను నిత్యం తీసుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube