ఇంట్లో రావి చెట్టు ఉండకూడదా.. ఈ చెట్టు నీడ ఇంటిపై పడితే..!

సాధారణంగా మన దేశంలోని ప్రజలు చాలామంది వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.ఇల్లు నిర్మించాలని భావించినప్పుడు స్థలంలో ఎలాంటి చెట్లు ఉండాలి.

 Why Peepal Tree Shodow Should Not Be Placed On Home Details, Peepal Tree, Peepal-TeluguStop.com

ఏ చెట్టు ఏ వైపు ఉంటే మంచిదని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు.స్థలం విశాలంగా ఉన్నప్పుడు ప్రతి గృహానికి నిర్దేశించిన దిక్కులో వృక్షాలు ( Trees ) ఉండడం శుభమని చాలా మంది ప్రజలు నమ్ముతారు.

చెట్లు కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి.కాబట్టి ఇంటి ప్రాంగణంలో చెట్లు ఉండడంవల్ల వాతావరణం, గాలి పరిశుద్ధంగా ఉంటుంది.

ముఖ్యంగా రావి చెట్టు( Peepal Tree ) సహా అనేక చెట్లను హిందువులు పవిత్రంగా భావించి పూజిస్తారు.రావి చెట్టు గురించి వర్ణన శ్రీకృష్ణుని భగవద్గీతలో ( Bhagavadgita ) కూడా ఉంది.

రావి చెట్టుపై సకల దేవతలు నివసిస్తారని చెబుతూ ఉంటారు.అయితే రావి చెట్టు 24 గంటల పాటు ఆక్సిజన్ అందజేస్తున్నప్పటికీ ప్రజలు తమ ఇంట్లో, పెరట్లో దీనిని అసలు నాటరు.

ఇంట్లో ఈ చెట్టును ఎందుకు ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

రావి చెట్టు కొన్ని సంవత్సరాలలో పెద్ద వృక్షంగా ఎదుగుతుంది.కాబట్టి దాని వేర్లు చాలా దూరం వరకు వ్యాపిస్తాయని ప్రజలు నమ్ముతారు.ఇంట్లో ఈ చెట్టు పెరిగితే దానివేర్లు ఇంటి పునాదిని బలహీనపరుస్తాయని భావిస్తారు.

ఇది ఇంటి పునాదిని కదిలించగలదు.ముఖ్యంగా చెప్పాలంటే రావి చెట్టు నీడ ఒక నిర్దేశాదిశా నుంచి ఇంటిపై పడితే ఆ కుటుంబ సభ్యులలో భేదభిప్రాయాలు వస్తాయని చాలామంది నమ్ముతారు.

అందువల్ల ఆ కుటుంబ సభ్యుల పురోభివృద్ధికి అడ్డంకులు ఏర్పడవచ్చు.రావి చెట్టు నీడ మనసులో ప్రతికూల ప్రకంపనలను సృష్టిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రావి చెట్టు నీడ ఇంటిపై పడితే అది హానికరమని నమ్ముతారు.ఇది ఆ ఇంటి కుటుంబ సభ్యుల పై ప్రతికూల ప్రభావం చూపుతోందని చెబుతూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube