విశ్వ ప్రసిద్ధి పూరి శ్రీ క్షేత్రంన్ని మరింత అందంగా చేయాలన్నా ఉద్దేశంతో దేవాలయ అధికారులందరూ దేవాలయ శిఖరం పై ఆత్యాధునిక విద్యుత్ వెలుగులను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ బాధ్యతను పురావస్తు శాఖకు అప్పగించి 18 నెలలకు పైగా గడిచిన పనులు ఇంకా నిదానంగా కొనసాగుతూనే ఉన్నాయి.
దిని పై సేవాయాత్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ క్షేత్రానికి 3d దీపాల కోసం కోటిన్నర రూపాయల వరకు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఈ దీపాలు ఏర్పాటు శిఖరంపై రంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో పూరి తీరం, రైల్వే స్టేషన్ నుంచి భక్తులకు కనిపించే అవకాశం ఉంది.శ్రీ క్షేత్రం మరమ్మతులు ఇతర నిర్మాణా పనులు ఏఎస్ ఐ పర్యవేక్షణలో జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆధునిక విద్యుత్ దీపాల ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర అధ్యయనం చేసిన ఏఎస్ఐ అధికారులు పనులను కేంద్ర జల శక్తి శాఖ ఆధీనంలోకి బదిలీ చేసినట్లు సమాచారం.
భోగ మండపం కుర్మ బేడ, 22 మెట్లు, మేఘనాధ ప్రహరీ గర్భగుడి ప్రవేశద్వారం కల్ప బాట ప్రాంతాల్లో ఆధునిక దీపాల ఏర్పాటు పనులు మొదలుపెట్టింది.
ఆలయ శిఖరం పై ఏర్పాట అయ్యే త్రీడి దీపాలను భక్తులు చూడగలుగుతారు.పూరి క్షేత్రం, కోణార్క్ సూర్యనారాయణమూర్తి ఆలయానికి ఒకేసారి ఏఎస్ఐ ఆధ్వర్యంలో పనులు మొదలుపెట్టారు.
కోణార్క్ లో దేవాలయం పనులు పూర్తయి ఆరు నెలలైనా జగన్నాథ సన్నిధిలో ఇంకా పూర్తి కాలేదు.
దేశంలోని ఇతర ప్రముఖ ఆలయాల కంటే శ్రీ క్షేత్రం భిన్నమైనది అని ఆలయంలో విద్యుత్ దీపాల పనులు చేసే అధికారులు చెబుతున్నారు.జగన్నాథుడు జీవబ్రహ్మ స్వరూపుడని ఇక్కడ స్వామికి నిత్యం అనేక సేవలు చేస్తూ ఉంటారని వీటిని పరిగణలోకి తీసుకునే ఈ ఆలయ విద్యుత్ దీపాల పనులు జరుగుతున్నాయని చెప్పారు.స్వామి సేవలకు అంతరాయం కలగకుండా విద్యుత్ పనులు చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.
శ్రీ క్షేత్ర శిఖరం పై గతంలో ఏర్పాటు చేసిన ఆధునిక దీపాలపై కోతులు దూకడం వల్ల పాడైపోయాయని కూడా తెలిపారు.దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ సెట్టింగ్ తయారు చేసి త్రిడి దీపాలు ఏర్పాటు చేశామని చెప్పారు.
DEVOTIONAL