ఒక వ్యక్తి ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ విజయం సాధించలేకపోతున్నారు అంటే వారిలో దృఢమైన ఆత్మవిశ్వాసం లేదు అని అర్థం చేసుకోవచ్చు.ఆత్మవిశ్వాసంతో ప్రతి రంగంలోనూ అద్భుతాలు చేయవచ్చని చాలా మంది యువత నిరూపించారు.
అయితే మనలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే కొన్ని వాస్తు చిట్కాలు కూడా ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతూ ఉంది.ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి వాస్తు నిపుణులు సూచించిన కొన్ని వాస్తు చిట్కాలను పాటించినట్లయితే మీరు మీ జీవితంలో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు అని కూడా చెబుతున్నారు.
ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని అనుకునేవారు ముఖ్యంగా మీ చేతిలో పగడంతో తయారు చేసిన ఉంగరాన్ని ధరించటం మంచిది.పగడపు రాయికి కుజుడు అధిపతి.ఈ రత్నాన్ని ధరించడం వల్ల కుజుడు బలవంతులవుతాడు.ఫలితంగా మీ జీవితంలో మీకే తెలియకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఇంకా చెప్పాలంటే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలనుకునే వారు మీ గదిలో ఉదయించే సూర్యుడి చిత్రాన్ని, గుర్రం చిత్రాన్ని ఉంచుకోవాలని చెబుతూ ఉంటారు.
వీటి వల్ల ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా ప్రతికూల ప్రభావం కూడా దూరం అవుతుంది.ఇంకా చెప్పాలంటే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలనుకునే వారు ఉదయాన్నే నిద్ర లేచి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలని ఒక జగ్గు నీళ్లు తీసుకొని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఆయనను మనస్ఫూర్తిగా పూజించాలని చెబుతూ ఉంటారు.ఆదిత్య హృదయం స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పాటించాలని సూర్య భగవానుడికి నీటిని సమర్పించడం వల్ల ఆయన మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడని పండితులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే ఆవుకు పచ్చి గడ్డి తినిపించడం వల్ల బుధ గ్రహస్థితి బలపడుతుందని మనసు ప్రశాంతంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.హిందువులు పవిత్రంగా పూజించే ఆవుకు గడ్డి కానీ, ఆహారం కానీ తినిపించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఇంట్లో కిటికీ వెన్ను చూపించి కూర్చోకూడదని పండితులు చెబుతున్నారు.