యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా మొదట ప్రకటించిన రిలీజ్ డేట్ ప్రకారం 2026 సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా 2026 జూన్ కు వాయిదా పడింది.2026 సంవత్సరం జూన్ నెల 25వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
అయితే పెద్ద సినిమాలకు జూన్ నెల అనుకూలం కాదు.
స్కూల్స్ స్టార్ట్ అయ్యే సమయంలో పెద్ద సినిమాలను రిలీజ్ చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించరు.ఈ విషయం తెలిసి కూడా డ్రాగన్ మూవీ( Dragon Movie ) మేకర్స్ ఎందుకు ఇలాంటి రిస్క్ తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు.
ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు.ఈ సినిమా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతుండటం గమనార్హం.

ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేస్తున్నట్టు తెలుస్తోంది.ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని పుష్ప ది రూల్ రికార్డులను బ్రేక్ చేసే సినిమా ఇదేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.లుక్స్ విషయంలో సైతం ఎన్టీఆర్ ఎంతో కేర్ తీసుకుంటున్నారు.జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో స్లిమ్ లుక్ లో కనిపించనుననరు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఒకింత భారీ స్థాయిలో ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.తారక్ కెరీర్ రేంజ్ ను ఎన్నో రెట్లు పెంచే సినిమా ఈ సినిమా అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకున్న ఇండస్ట్రీ హిట్ ఈ సినిమాతో దక్కుతుందేమో చూడాలి.జూనియర్ ఎన్టీఆర్ 32వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా గ్లింప్స్ విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.