అబ్బాయిల్లో పల్చటి జుట్టుతో( thin hair ) బాధపడుతున్న వారు ఎందరో ఉన్నారు.కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుని పని చేయడం, ఒత్తిడి, ధూమపానం, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత తదితర కారణాల వల్ల జుట్టు విపరీతంగా రాలిపోయి పల్చగా మారుతుంది.
దాంతో జుట్టును మళ్ళీ ఒత్తుగా ఎలా మార్చుకోవాలో తెలియక తెగ వర్రీ అయిపోతుంటారు.మీరు ఏం జాబితాలో ఉన్నారా.? అయితే ఇకపై నో వర్రీ.ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్ ను వాడితే మీ జుట్టు ఎంత పల్చగా ఉన్నా ఒత్తుగా మారుతుంది.
కురులు దట్టంగా పెరుగుతాయి.మరి ఇంతకీ ఆ క్రీమ్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా అంగుళం అల్లం ముక్కను( ginger ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.ఈ అల్లం తురుము నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ) ను వేసుకోవాలి.అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు అల్లం జ్యూస్,( ginger juice ) వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె( Mustard oil ), వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేయాలి.
తద్వారా మన హెయిర్ క్రీమ్ రెడీ అవుతుంది.
ఇప్పుడు ఈ క్రీమ్ ను కొంచెం కొంచెం గా తీసుకుంటూ స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ క్రీమ్ ను వాడటం వల్ల సూపర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.
అల్లం, ఆవనూనె, అలోవెరా జెల్ మరియు తేనెలో ఉండే పోషకాలు జుట్టు ఎదుగుదలను పెంచుతాయి.కురులు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.పల్చటి జుట్టును దట్టంగా మారుస్తాయి.హెయిర్ ఫాల్ ను అరికడతాయి.
కాబట్టి ఒత్తైన జుట్టును కోరుకునే అబ్బాయిలు తప్పకుండా ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.