1.ప్రపంచ కప్ ముగింపు వేడుకల్లో
భారత్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కు అంతా సిద్ధమైంది.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోది స్టేడియం వేదికగా రేపు ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఈ ముగింపు వేడుకల్లో భారత వైమానిక దళం విన్యాసాలు చేపట్టనుంది.
2.కెసిఆర్ పై పొంగులేటి విమర్శలు
తెలంగాణ ప్రజలు కేసిఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఖమ్మం మాజీ ఎంపీ ,పాలేరు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.
3.కాంగ్రెస్పై కేటీఆర్ విమర్శలు
ప్రభుత్వం మంచి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ దానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ విమర్శించారు.
4. విజయశాంతి విమర్శలు
సీఎం కేసీఆర్ నాటిన ఒక మొక్క బిజెపి పార్టీని నాశనం చేసిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శించారు.
5.ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు .ఎన్నికల ప్రచార రథంలోనే కవిత కళ్ళు తిరిగి పడిపోయారు.
6.హైదరాబాద్ కు అమిత్ షా
నేడు తెలంగాణలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు .ఎన్నికల ప్రచారంలో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు.
7.పురందేశ్వరి కామెంట్స్
ఏపీ ప్రభుత్వ అవినీతి గురించి తాను విమర్శలు చేస్తే, తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి అన్నారు.
8.విజయశాంతికి కీలక పదవి
బిజెపికి రాజీనామా చేసి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన విజయశాంతికి ప్రచార ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ గా కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది.
9.ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్
కెసిఆర్ చెబుతున్నట్లుగా రైతుబంధు ఆపాలని తను ఎక్కడ ఫిర్యాదు చేయలేదని, ఓటమి భయంతోనే కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తంకుమార్ రెడ్డి విమర్శించారు.
10.కామారెడ్డిలో కేటీఆర్ రోడ్డు షో రద్దు
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి లోని పెద్ద మల్లారెడ్డి లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించాల్సి ఉన్నా, దానిని రద్దు చేసుకున్నారు.
11.ఈటెల రాజేందర్ కామెంట్స్
కాంగ్రెస్ పార్టీలో అగ్రకులాల వారే సీఎం అవుతారని బిజెపి నేత ఈటెల రాజేందర్ విమర్శించారు.
12.మేం శత్రులం కాదు : తుమ్మల
పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై మాజీ మంత్రి, ఖమ్మం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాను శత్రువులం కాదు అని ఆయన వ్యాఖ్యానించారు.
13.బండి సంజయ్ కామెంట్స్
ప్రజా సమస్యలపై పోరాడి జైలుకుపోయిన చరిత్ర నాదని , బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
14.టిడిపి జనసేన ఉమ్మడి ఆందోళన కార్యక్రమాలు
ఏపీలో టిడిపి జనసేన కలిసి ఉమ్మడిగా ప్రభుత్వ వైఫల్యాలు పై పోరాట కార్యక్రమానికి సిద్ధమవుతున్నాయి.దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కు దారేది పేరుతో వినూత్న నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
15. ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన
కాంగ్రెస్ కీలక నాయకురాలు ప్రియాంక గాంధీ రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
15.భారత్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కు ప్రధాని మోదీ
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోది స్టేడియంలో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ ను తిలకించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోది స్వయంగా హాజరు కానున్నారు.
16.కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పర్యటన
నేడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
17.సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ పర్యటన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో సీఎం కెసిఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
18.నేడు బిజెపి మేనిఫెస్టో విడుదల
నేడు బిజెపి ఎన్నికల మేనిఫెస్టోను సాయంత్రం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు.
19.జగన్ ఆసక్తికర కామెంట్స్
వచ్చే ఎన్నికల్లో తోడేళ్లు ఏకమైన సింహం సింగిల్ గానే వస్తుందని ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
20.ఎమ్మెల్సీ కవిత ట్వీట్
జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండలం ఇటిక్యాల లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురైన నేపథ్యంలో తాను ఆరోగ్యంగానే ఉన్నానని కవిత ట్విట్ చేశారు.