అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకి (FBI )సారథ్యం వహించే అవకాశం దక్కించుకున్న భారత సంతతికి చెందిన కాష్ పటేల్ (Kash Patel)ఈ పదవికి అడుగు దూరంలో నిలిచారు.యూఎస్ సెనేట్ (US Senate)తన నామినేషన్‌ను ధ్రువీకరించేందుకు అవసరమైన విధానపరమైన చర్యపై ఓటు వేసింది.
నామినేషన్‌ను ధృవీకరించాల్సిన యూఎస్ సెనేట్ 48-45 ఓట్లతో నామినీపై చర్చను ప్రారంభించింది.పటేల్ గురువారం తుది ఆమోదం పొందే ముందు 30 గంటల చర్చకు కౌంట్ డౌన్ ప్రారంభించింది.
44 ఏళ్ల కాష్ పటేల్.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)మంత్రివర్గం, ఇతర పరిపాలనా యంత్రాంగానికి నియమించిన వారిలో అత్యంత వివాదాస్పద వ్యక్తి.
ఈ వివాదాస్ప నామినీలలో కొందరినీ వ్యతిరేకించిన రిపబ్లికన్ సెనేటర్లు .ట్రంప్ (trump)నిర్ణయంతో ఏకీభవించారు.న్యాయ శాఖ అధిపతిగా నామినేట్ అయిన మాట్ గెట్జ్ తప్పించి అందరినీ నియామకాలను ధృవీకరించారు.మైనర్లతో అతని లైంగిక సంబంధాల గురించి వచ్చిన ప్రతికూల వార్తల నేపథ్యంలో అనేక మంది రిపబ్లికన్ సెనేటర్లు (Republican Senators)అతని ఉద్యోగానికి తగినవాడు కాదని నిర్ధారించుకున్న తర్వాత మాట్ గెట్జ్ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నాడు.
ఎవరీ కశ్యప్ పటేల్ :

గుజరాత్ మూలాలున్న తల్లిదండ్రులకు న్యూయార్క్‌లో 1980లో జన్మించారు కాష్ పటేల్.తొలుత వీరి కుటుంబం ఆఫ్రికాలోని ఉగాండాలో ఉండేది.అయితే అప్పటి ఆ దేశ నియంత ఈదీ ఆమిన్ వేధింపుల కారణంగా కాష్ తల్లిదండ్రులు అమెరికాకు వలస వచ్చారు.యూనివర్సిటీ ఆఫ్ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కశ్యప్.
అనంతరం యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో లా పట్టా పొందారు.అనంతరం మియామీ కోర్టులలో పలు హోదాలలో పనిచేశారు.

అమెరికా అధ్యక్షుడికి డిప్యూటీ అసిస్టెంట్‌గా, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎన్ఎస్‌సీ)లో కౌంటర్ టెర్రరిజం సీనియర్ డైరెక్టర్‌గా సేవలందించారు.అతని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొఫైల్ ప్రకారం.నేషనల్ ఇంటెలిజెన్స్ యాక్టింగ్ డైరెక్టర్‌కు ప్రిన్సిపల్ డిప్యూటీగా కూడా పనిచేశారు.ఈ హోదాలో ఆయన 17 ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ ఏజెన్సీల కార్యకలాపాలను పర్యవేక్షించడంతో పాటు అధ్యక్షుడి రోజువారీ బ్రీఫింగ్‌ను అందించేవారు.ఇక రిపబ్లికన్ పార్టీకి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్‌కు వీర విధేయుడిగా కాష్ పటేల్‌కు అమెరికా రాజకీయాల్లో పేరుంది.2020 అధ్యక్ష ఎన్నికల తర్వాత యూఎస్ కేపిటల్ వద్ద చోటు చేసుకున్న ఘటన కేసులో కశ్యప్ పటేల్ పేరు కూడా వినిపించింది.