పచ్చిమిర్చి కట్ చేశాక చేతులు మండిపోతున్నాయా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతినిత్యం పచ్చిమిర్చిని( green chillies ) వాడుతుంటారు.ఏ కూర వండాలన్న పచ్చిమిర్చి పడాల్సిందే.

 How To Get Rid Of The Burning Sensation After Cutting Chillies! Burning Sensatio-TeluguStop.com

పచ్చిమిర్చి వల్ల కూరలకు చక్కని రుచి వస్తుంది.అలాగే ఆరోగ్యానికి కూడా పచ్చిమిర్చి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.

ముఖ్యంగా శరీరంలో కొవ్వును కరిగించడంలో, జీర్ణ శక్తిని పెంచడంలో, రోగనిరోధక వ్యవస్థను బలపరచడంలో, శరీరంలోని అనవసర బ్యాక్టీరియాను నాశనం చేయడంలో పచ్చిమిర్చి చాలా బాగా సహాయపడుతుంది.ఇదంతా పక్కన పెడితే.

పచ్చిమిర్చి కట్ చేశాక చేతులు విపరీతంగా మండిపోతూ ఉంటాయి.పైగా ఆ మండే చేతులతో శరీరంపై ఎక్కడ పట్టుకుంటే అక్కడ మంట పుడుతుంటుంది.

ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు క్యాప్సైసిన్( Capsaicin ) అనే జిడ్డు పదార్థాన్ని కలిగి ఉంటాయి.ఇది చేతుల‌కు అంటుకున్న‌ప్పుడు బర్నింగ్ సెన్సేషన్ ను క‌లిగిస్తుంది.ఆ బర్నింగ్ సెన్సేషన్ కారణంగా ఆడవారు పచ్చిమిర్చి కట్ చేయాలంటేనే చిరాకు పడుతుంటారు.అయితే పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను కనుక ఫాలో అయ్యారంటే చేతులు మంట పెట్టడం అన్న ముచ్చటే ఉండదు.

Telugu Green, Rid, Latest-Telugu Health

నిత్యం పచ్చి మిరపకాయలను కట్ చేయడానికి ముందు చేతులకు కొబ్బరి నూనె( coconut oil ) లేదా ఆలివ్ ఆయిల్ రాసుకోవాలి.ఇలా చేయడం వల్ల చేతులు మంట పుట్టకుండా ఉంటాయి.అలాగే డిష్ సోప్‌లు జిడ్డుగల ప్లేట్‌లను శుభ్రం చేయడంలో సహాయపడటమే కాదు మీ చేతుల నుంచి మిరప మంటను వదిలించడానికి కూడా హెల్ప్ చేస్తాయి.పచ్చిమిర్చిని కట్ చేసిన వెంటనే డిష్ వాష్ తో రెండు మూడు సార్లు చేతులు శుభ్రంగా కడగాలి.

ఇలా చేయడం వల్ల మంట పోతుంది.

Telugu Green, Rid, Latest-Telugu Health

ప‌చ్చిమిర్చి తరిగిన తర్వాత చేతులు మండుతుంటే మీరు పాలు ఉపయోగించవచ్చు.పాలులో కేసిన్ ( Casein )అనే రసాయనం ఉంటుంది.ఇది మండుతున్న చేతులకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

అందుకోసం ఒక గిన్నెలో పాలు తీసుకుని అందులో చేతులను బాగా నానబెట్టాలి.ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అలాగే వ‌న్‌ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా లేదా మొక్కజొన్న పిండిని నీటిలో కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి.దీన్ని మీ చేతుల‌కు అప్లే చేసుకుని 15 నిమిషాల త‌ర్వాత వాట‌ర్ తో వాష్ చేసుకోండి.

మంటకు కారణమయ్యే నూనెలను చ‌ర్మంపై నుంచి తొలగించడానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube