వయసు పైబడే కొద్దీ జుట్టులో మెలనిన్ ఉత్పత్తి( Melanin ) అనేది తగ్గుతూ ఉంటుంది.దీని కారణంగా జుట్టు తెల్లబడటం ప్రారంభమవుతుంది.
అయితే ఇటీవల కాలంలో కొందరు చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు.పెరిగిన కాలుష్యం, జీవన శైలిలో మార్పులు, రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులను వాడటం తదితర అంశాలు జుట్టు( Hair )లో మెలనిన్ ను ప్రభావితం చేస్తున్నాయి.
దాంతో పాతిక ముప్పై ఏళ్లకే ఎంతో మంది వైట్ హెయిర్ తో వర్రీ అవుతున్నారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.ఎటువంటి కలర్స్ మరియు కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే సహజంగా తెల్ల జుట్టు( White Hair )ను నల్లగా మార్చుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.మరి ఎందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు టీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్( Kalonji Seeds ), పది లవంగాలు వేసుకోవాలి.అలాగే రెండు నుంచి మూడు తమలపాకులను ముక్కలుగా తుంచి వేసుకోవాలి.రెండు రెబ్బలు కరివేపాకు మరియు నాలుగు టేబుల్ స్పూన్లు బీట్ రూట్ తురుము( Beetroot ) వేసుకొని ఉడికించాలి.
దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఆపై వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్, తయారు చేసి పెట్టుకున్న వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా హెన్నా మిశ్రమంలో ఒక ఎగ్ ను కూడా వేసి మరోసారి కలుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టులో మెలనిన్ ఉత్పత్తి అనేది అద్భుతంగా పెరుగుతుంది.తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.వైట్ హెయిర్ తో బాధపడుతున్న వారికి ఈ రెమెడీ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.ప్రతి వారం ఈ రెమెడీని పాటించారంటే నల్లటి మెరిసే కురులు మీ సొంతం అవుతాయి.