దేశంలో కేరళ సినిమా పరిశ్రమ అనేది చాలా అంటే చాలా ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు.సినిమాల విషయంలోనూ వాళ్లు అనుసరించే పంథా సరికొత్తగా ఉంటుంది.
అక్కడి సినిమాలు చాలా ఆలోచనాత్మకంగా ఉంటాయి.కథలు, కథనాలు, స్ర్కీన్ ప్లే.
డైలాగులు.అన్ని చక్కగా ఉంటాయి.
అదీ ఇదీ అని ఏం లేదు.చాలా సినిమాలు అద్భుతంగానే ఉంటాయి.
అలాంటి మల్లూవుడ్ లో ఎంతో మంది హీరోలు ఎన్నో రికార్డులు నెలకొల్పారు.భారత్ లో ఎక్కువ సినిమాలు చేసిన హీరోలంతా కేరళాకు చెందిన వారే కావడం విశేషం.
తాజాగా ఈ లిస్టులో మరో హీరో చేశారు.ఇంతక్ తను ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
దిగ్గజ నటుడు ప్రేమ్ నజీర్ 700 సినిమాల్లో హీరోగా నటించాడు.ఆయన కేరళకు చెందిన నటుడే.తాజాగా 400 సినిమాలు చేసిన మరో హీరోగా మమ్ముట్టి రికార్డుల్లోకి ఎక్కడు.ఈ మధ్యే 50 ఏండ్లు పూర్తి చేసుకున్న ఈ కేరళ మెగాస్టార్.400లకు పైగా సినిమాల్లో హీరోగా నటించాడు.ఈయన నటించిన చాలా సినిమాల్లో విజయాలు అందుకున్నవే.
ఒకటి అర మాత్రమే ఫ్లాప్ అయ్యాయి.సెప్టెంబర్ 7న ఆయన జన్మదినం కావడంతో పెద్ద ఎత్తున్న మమ్ముట్టి బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు ఆయన అభిమాను.
మమ్ముట్టి ఖాతాలో చాలా అంటే చాలా రికార్డులు ఉన్నాయి.కేవలం 1980వ సంవత్సరంలో 34 సినిమాలు చేసి.ఏ ఇండియన్ హీరోకు సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు.నాలుగేళ్లలో 120 సినిమాలు చేశాడు.
చాలా తక్కువ సమయంలోనే 400 మార్కును దాటాడు మమ్ముట్టి.అంతేకాదు.
కేరళలో మమ్ముట్టిని మించి మాస్ హీరో మరొకరు లేరంటే ఆశ్చర్యపోవాల్సిందే.కెరీర్ లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన ఆయనకు మరో అరుదైన రికార్డు కూడా ఉంది.
ఆయన నటించిన తొలి సినిమా ఇంత వరకు విడుదల కాకపోవడం విశేషం.మమ్ముట్టి చదువుకుంటున్న రోజుల్లోనే సినిమాల్లో అవకాశం వచ్చింది.
దేవలోకం పేరుతో ఈ సినిమా తెరకెక్కింది.అయితే ఆ సినిమా పలు రకాల సమస్యలతో రిలీజ్ కు నోచుకోలేదు.