పెరుగు( curd ).ఒక సూపర్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు.
పాల నుండి తయారయ్యే ఉత్పత్తుల్లో పెరుగు ఒకటి.మన భారతీయులకు పెరుగుతో విడదీయలేని సంబంధం ఉంది.
ఎన్ని కూరలతో భోజనం చేసిన సరే.చివర్లో రెండు ముద్దలు పెరుగుతూ ముగించకపోతే అసంపూర్ణంగా ఉంటుంది.అయితే నిత్యం పెరుగు తినడం వల్ల బరువు పెరుగుతారు అనే భావన చాలా మందిలో ఉంది.కానీ నిజానికి ఇది కేవలం అపోహ మాత్రమే.పెరుగు తినడం వల్ల బరువు పెరగడం కాదు తగ్గుతారు.రోజుకు ఒక పూట పెరుగు తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యల ( Health problems )నుంచి సైతం బయటపడతారు.
పెరుగులో కాల్షియం, ఫాస్పరస్, ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ డి, ప్రోబయోటిక్స్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.నిత్యం ఒక పూట పెరుగు తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలు చేకూరుతాయి.
ముఖ్యంగా బరువు తగ్గాలని భావిస్తున్న వారు ఖచ్చితంగా డే టైంలో ఒక కప్పు పెరుగు తీసుకోండి.పెరుగులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.అందువల్ల పెరుగు ఎక్కువసేపు కడుపును నిండుగా ఉంచుతుంది.అతి ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.
మెటబాలిజం ( Metabolism )రేటును పెంచుతుంది.

ఒత్తిడి, ఆందోళనకు కారణమయ్యే కార్టిసోల్ హార్మోన్ స్థాయిలను( Cortisol hormone levels ) తగ్గించడంలో కూడా పెరుగు హెల్ప్ చేస్తుంది.అలాగే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు కచ్చితంగా పెరుగును డైట్ లో చేర్చుకోండి.పెరుగులో పొటాషియం ఉంటుంది.
ఇది రక్తపోటు స్థాయిలను అదుపులోకి తెస్తుంది.పెరుగులో ఉండే కాల్షియం ఎముకలను, దంతాలను బలోపేతం చేస్తుంది.

పెరుగులో విటమిన్ డి కూడా ఉంటుంది.ఇది శరీరం కాల్షియంను గ్రహించడంలో తోడ్పడుతుంది.రోగ నిరోధక వ్యవస్థను( Immune system ) బలపరుస్తుంది.అంతే కాకుండా నిత్యం పెరుగు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది మరియు శరీరంలో అధిక వేడి సైతం దూరమవుతుంది.