కొత్త దుస్తులను చూడగానే చాలా మందికి వేసుకోవాలనే కోరిక కలుగుతుంది.ఇక పండుగ సీజన్ లో వరుసగా ఆఫర్స్ పెట్టడంతో చాలామంది షాపింగ్ చేస్తూ ఉంటారు.
ఇక మహిళలు( Women ) అయితే ఏది కొనాలో తెలియక తర్జన భర్జన పడుతూ ఉంటారు.అన్ని ఆఫర్లు ఉంటాయి.
ఇక ఎలాగో మనకు కావాలి.ఎలాగో ఆఫర్లలో ఉన్నాయి.
ఇలా వేరే వేరే అకేషన్స్ కి కూడా ముందుగానే కొని దాచి పెడుతుంటారు.ఇక కొత్త దుస్తులను ఎప్పుడు వేసుకుందామా, కొత్త దుస్తులను పదిమందికి ఎప్పుడు చూపిద్దామా అని తెగ ఆత్రంగా ఉంటారు.
అయితే ఇక్కడే చాలామంది తప్పులు చేస్తుంటారు.కొత్త దుస్తులను నేరుగా వేసుకుంటూ ఉంటారు.

కొత్త దుస్తులను( New clothes ) వాష్ చేయకుండా నేరుగా వేసుకుంటారు.ఇలా వేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు( Health problems ) ఎదురవుతాయి అన్న విషయం చాలా మందికి తెలియదు.అవును మీరు చదువుతున్నది నిజమే.కొత్త దుస్తులు ధరించడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే కొత్త దుస్తులను స్టోర్ చేసే ప్లేస్ ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు.ఎక్కడెక్కడో పెట్టుకొని తీసుకొస్తారు.
దాంతో క్రిములు కూడా ఎక్కువ అవుతాయి.వీటి పై బ్యాక్టీరియా సూక్ష్మజీవులు( Bacteria are microorganisms ) తప్పకుండా ఉంటాయి.
అందుకే కొత్త దుస్తులను ఉపయోగించే ముందు ఒకసారి వాష్ చేసుకుని ఉపయోగించాలి.ఇంకా చెప్పాలంటే దుస్తులను తయారు చేయడానికి అనేక రకాల రసాయనాలను ఉపయోగిస్తూ ఉంటారు.

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా రెడీమేడ్ దుస్తులు ఎక్కువగా లభ్యమవుతున్నాయి.వీటి తయారీలో వివిధ రంగులు ఇతర రసాయనాలను ఉపయోగించి ఉంటారు.దుస్తులను కొన్నిసార్లు పాలిష్ చేయడంలో, ప్రింటింగ్ చేయడంలో ఇలా వాటిలో అనేక రసాయనాలను ఉపయోగిస్తారు.అందుకే క్లీన్ చేసి ఉపయోగించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.కొత్త దుస్తులను ధరించినప్పుడు దురద చిరాకుగా ఉంటుంది.దీనికి గల కారణం వాటిలో ఉండే బ్యాక్టీరియా అని వైద్యులు చెబుతున్నారు.అలాగే కొత్త దుస్తులు చెమటను, నీటిని ఎక్కువగా గ్రహించలేవు.ఇంకా చెప్పాలంటే పిల్లలు, గర్భిణీలు కొత్త దుస్తులను వేసుకోవాలి అనుకుంటే కచ్చితంగా వాటిని వాష్ చేసి మాత్రమే ధరించడం మంచిది.