సాధారణంగా కొందరి పెదవులు తరచూ పగిలి పోతుంటాయి.ఇక పెదాలు పగిలితే.
ఎంత తీవ్రమైన నొప్పి, మంట ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అందుకే పగిలిన పెదాలను నివారించుకునేందుకు ఖరీదైన క్రీములు, ఆయిల్స్ కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయినప్పటికీ, ఫలితం లేకుండా.ఎలా తగ్గించుకోవాలో తెలియక సతమతమవుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ పాటిస్తే.సులువుగా పగిలి మంట పుట్టించే పెదాలను మృదువుగా, అందంగా మార్చుకోవచ్చు.
మరి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయకుండా ఇప్పుడు చూసేయండి.
పగిలిన పెదాలను నివారించడంలో టమాటా అద్భుతంగా సహాయపడుతుంది.
బాగా పండిన టమాటా తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఆ పేస్ట్‌ను పెదాలపై అప్లై చేసి.
ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు వదిలేయాలి.ఆ తర్వాత చల్లటి నీటితో పెదాలను క్లీన్ చేసుకోవాలి.
ఇలా రోజుకు ఒకటి లేదా రెండు సార్లు చేస్తూ ఉంటే.పెదాలు మృదువుగా, అందంగా మారతాయి.
గులాబీలు కూడా పెదాల పగుళ్లను నివారిస్తాయి.కొన్ని గులాబీ రేకలు తీసుకుని పాలలో వేసి రెండు గంటల పాటు నాన బెట్టుకోవాలి.ఆ తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెదవులకు పూతలా వేయాలి.పావు గంట పాటు ఆరనిచ్చి.ఆ తర్వాత కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా తరచూ చేస్తే.పగిలిన పెదాలు కోమలంగా మారతాయి.
ఇక ఒక బౌల్‌లో ఆలివ్ ఆయిల్ మరియు తేనె సమానంగా తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి.రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో పెదాలను శుభ్రం చేసుకోవాలి.
ఇలా ఉదయం, సాయంత్రం చేస్తూ ఉంటే.పగిలిన పెదవులు నున్నబడతాయి.