ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ట్రావెలింగ్ ఓ ట్రెండీ హాబీగా మారిపోయింది.కుర్రకారు బ్యాగులు సర్దుకుని కొత్త ప్రదేశాలను ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు.
కొందరు యూట్యూబ్ వ్యూస్, ఇన్‌స్టా క్లిక్స్ కోసమైతే, ఇంకొందరు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ల కోసం ట్రిప్పులేస్తున్నారు.
ఇలాంటి టైమ్‌లో ఓ 19 ఏళ్ల అమ్మాయి ఏకంగా 90 దేశాలు చుట్టేసి, తన ఫేవరెట్ డెస్టినేషన్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది.సోఫియా లీ అనే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ తన బయోలో 100 కంట్రీస్ విజిట్ చేసినట్టు రాసుకుంది.2024, నవంబర్‌లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ.19 ఏళ్లకే 90 దేశాలు తిరిగొచ్చానని చెప్పింది.అంతేకాదు, తన టాప్ 6 ఫేవరెట్ ప్లేసెస్ లిస్ట్‌ను( 6 favorite places list ) కూడా రివీల్ చేసింది.
సోఫియా( Sofia ) తన లిస్ట్‌లో టాంజానియాను 6వ ప్లేస్‌లో పెట్టింది.ఆ తర్వాత ఫ్రాన్స్ (5), కోస్టారికా (4), జార్జియా (3), థాయిలాండ్ (2) స్థానాల్లో నిలిచాయి.ఇక టాప్ ప్లేస్‌ను మన ఇండియా కొట్టేసింది.ఇండియా నంబర్ వన్ అనగానే ఇండియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోఫియా ఛాయిస్‌కు( Sophia’s Choice ) ఫిదా అయిపోతున్నారు.ఈ వీడియోకి 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
కామెంట్స్‌తో సోఫియాను ముంచెత్తుతున్నారు నెటిజన్లు.ఓ ఇండియన్ అయితే నెక్స్ట్ టైమ్ నార్త్ ఈస్ట్ ఇండియాను( Next time North East India ) విజిట్ చేయమని ఇన్వైట్ చేశాడు.
ఇంకొకరైతే పాకిస్థాన్ ( Pakistan )కూడా రమ్మని పిలిచాడు.
ఇటీవలి కాలంలో కొందరు విదేశీయులు, భారతీయులు సైతం భారతదేశంలో జీవన వ్యయం, కాలుష్యం అధికమని అంటున్నారు.ఇలాంటి సమయంలో ఓ యువతి భారతదేశానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ఎందరికో ఆనందాన్ని కలిగిస్తోంది.సోఫియా యంగ్ ఏజ్‌లోనే ఇన్ని కంట్రీస్ తిరగడం, అందులో మన ఇండియాను టాప్ ప్లేస్‌లో పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్.
ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.మీరూ కూడా దీన్ని చూసేయండి.