తొలిప్రేమ రెమ్యూనరేషన్ తో పవన్ అలాంటి పని చేశారా... ఏమైందంటే?

చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు నటుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) .ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించే ప్రేక్షకులను మెప్పించారు.

 Pawan Kalyan Bought His Favourite Books Tholiprema Movie Remuneration Details, P-TeluguStop.com

ఇలా హీరోగా మంచి ఆదరణ సొంతం చేసుకున్న పవన్ రాజకీయాలలోకి అడుగు పెట్టారు.జనసేన( Janasena ) పార్టీని స్థాపించిన ఈయన ఎన్నో అవమానాలను అడ్డంకులను ఎదుర్కొంటూ నేడు రాజకీయాలలో కూడా తన స్టామినా ఏంటో చూపించారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం( AP Deputy CM ) హోదాలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.

Telugu Tholi Prema, Deputycm, Janasena, Pawan Kalyan, Pawankalyan-Movie

ఇలా రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈయన ఎలాంటి కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదు అలాగే ముందుగా కమిట్ అయిన సినిమాలన్నింటినీ పూర్తి చేసే పనిలో ఉన్నారు.ఇకపోతే ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ముఖ్యంగా ఈయన నటించిన తొలిప్రేమ( Tholi Prema ) సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.నేను తొలిప్రేమ సినిమా చేసినందుకు గాను నాకు 15 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని పవన్ తెలిపారు.

Telugu Tholi Prema, Deputycm, Janasena, Pawan Kalyan, Pawankalyan-Movie

ఇలా ఈ సినిమా రెమ్యూనరేషన్ అందుకున్న తర్వాత ఒక బుక్ స్టాల్ వెళ్లాను అయితే అక్కడ ఉన్నటువంటి పుస్తకాలు( Books ) చూసి నాకు చాలా ఆనందం వేసింది.ఇప్పుడు నా దగ్గర చాలా డబ్బు ఉందని భావించి నాకెంతో ఇష్టమైన పుస్తకాన్నింటినీ కొనుగోలు చేశాను అలా ఆ రెమ్యూనరేషన్ తో సుమారు లక్షన్నర వరకు పుస్తకాలు కొనుక్కొని నా గదిలో నీటిగా అలంకరించాలని తెలిపారు.ఇలా నా ఎదురుగా నాకు నచ్చిన పుస్తకాలు ఉండటంతో వాటన్నింటిని చూస్తూ ఆ పుస్తకాలను చదువుతూ మూడు రోజుల పాటు నిద్ర లేకుండా సంతోషంగా గడిపాను.అలా నేను తొలిప్రేమ సినిమా ద్వారా వచ్చిన డబ్బులతో నాకెంతో ఇష్టమైన పుస్తకాలు కొన్నాను అంటూ ఈ సందర్భంగా పవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube