మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ( Ram Charan Tej ) హీరోగా శంకర్( Shankar ) దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్( Game Changer ) .ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.
ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.
ఏఎంబి మాల్ లో మీడియా సమావేశంలో ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ సుమ మాట్లాడుతూ రామ్ చరణ్ ని ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు.
ఇకపోతే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి( SS Rajamouli ) కూడా హాజరైన సంగతి తెలిసిందే.రామ్ చరణ్ రాజమౌళి కాంబినేషన్లో నటించిన RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అయ్యారు.ఈ సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో రాజమౌళి కూడా ఈ సినిమా వేడుకలలో భాగమయ్యారు.
ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో( Mahesh Babu ) సినిమాకు కమిట్ అయ్యారు ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
ఇకపోతే తాజాగా సుమ రామ్ చరణ్ ని ప్రశ్నిస్తూ నేడు మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు జరిగాయి .మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల కాబోతుందని మీరు భావిస్తున్నారు అంటూ సుమ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు రాంచరణ్ సమాధానం చెబుతూ… ఎలాంటి అడ్డంకులు ఎదురవ్వకుండా ఉంటే కచ్చితంగా ఏడాదిన్నర లోపే ఈ సినిమా విడుదల అవుతుందని రామ్ చరణ్ తెలిపారు.
ఇక రాంచరణ్ ఎన్టీఆర్ నటించిన RRR సినిమా కూడా ఏడాదిన్నర లోపే విడుదల కావాలని భావించారు కానీ అప్పట్లో కరోనా రావడంతో ఈ సినిమాకు ఏకంగా మూడేళ్ల సమయం పట్టిందని ఇప్పుడు అలాంటి అడ్డంకులు రాకపోతే తొందరగానే ప్రేక్షకుల ముందుకు వస్తుందని చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.