సాధారణంగా భార్యల్ని వేధింపులకు గురిచేసి, హత్యలు చేసిన భర్తలకి సంబందించిన వార్తల్ని మనం అపుడపుడూ చూస్తూ ఉంటాం.కానీ ఈమధ్య కాలంలో చూసుకుంటే, దేశంలో దీనికి రివర్స్ ఘటనలు చోటు చేసుకొని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి.
అదే సమయంలో భర్తలను టార్చర్ పెడుతున్న భార్యల ఘటనలు కూడా ఇటీవల సంచలనంగా మారుతున్నాయి.ఈ క్రంమలోనే కొన్ని రోజులు క్రితం అతుల్( Atul ) భార్య వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకోగా… తాజాగా ఢిల్లీలో పునీత్( Puneeth ) అనే వ్యక్తి సైతం.
భార్యల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకొని మరీ వీడియో రిలీజ్ చేసాడు.ఈ క్రమంలో.
ప్రస్తుతం ఏపీలో మాత్రం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
అవును… బాపట్లలోని( Bapatla ) కొత్త పాలెంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.వివరాల్లోకి వెళితే… కొత్తపాలెంకు చెందిన అరుణ.( Aruna ) గోకర్ణమఠంకు చెందిన అమరేంద్ర బాబుకు( Amarendra Babu ) సరిగ్గా పది సంవత్సరాల క్రితం వివాహం అయింది.
ఈ క్రమంలో కొన్నిరోజులుగా అమరేంద్రబాబు మద్యానికి( Alcohol ) బానిసై, పూర్తి బాధ్యతా రాహిత్యానికి లోనైనట్టు సమాచారం.ఈ క్రమంలో ప్రతిరోజు ఇంట్లో గొడవలకు దిగుతూ భార్యకు తిడుతూ కొట్టేవాడట.
ఇది రానురాను చినికి చినికి గాలివానలా మారడంతో భర్త వేధింపులు తాళలేక.అరుణ అనే మహిళ తన భర్తపైన శివాలెత్తి పోయింది.
ఈ క్రమంలోనే ఏకంగా నడి రోడ్డుమీద భర్తను కర్రతో కొట్టి, ఉరివేసి హతమార్చినట్లు వైరల్ అవుతున్న వీడియోనే నిదర్శనంగా కనబడుతోంది.ఈ ఘటన డిసెంబరు 31న రాత్రి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.అతడి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోయిన తరువాత కూడా భార్యను.వదలకుండా అక్కడికి కూడా వెళ్లి వేధించడంతో.భర్తపైన సదరు మహిళ ఈ విధంగా రివేంజ్ తీర్చుకున్నట్లు సమాచారం.దాంతో ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో సంచలనంగా మారింది.
ఆమెకి పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.ఇక పిల్లలు విషయంలో కూడా తన భర్త పూర్తి బాధ్యతా రాహిత్యంగా ఉంటున్నాడని, అదనంగా వరకట్నం కూడా కోరుతున్నాడని ఆమె ఆరోపించినట్టు సమాచారం.
ఇక ఏళ్ళు గడిచినా అతడిలో మార్పు రాకపోవడంతో ఇలా చేసినట్టు తెలుస్తోంది.