మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) హీరోగా శంకర్( Shankar ) దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కినటువంటి చిత్రం గేమ్ ఛేంజర్.( Game Changer ) ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.
ఇటీవల ఏఎంబి మాల్ లో మీడియా సమక్షంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.ఇకపోతే ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ నెల నాలుగో తేదీ రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు.
ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఇకపోతే ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Deputy CM Pawan Kalyan ) హాజరవుతారు అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి.పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పటివరకు ఎలాంటి సినిమా వేడుకలలో పాల్గొనలేదు.అయితే మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో రామ్ చరణ్ సినిమా ఈవెంట్ కు అతిథిగా హాజరు కాబోతున్నారు.
ఇక ఇదే విషయం గురించి నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించారు.
రామ్ చరణ్ సినిమా వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్న నేపథ్యంలో.వివరాలను నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటిస్తూ.పవన్ లుక్‌తో కూడిన పోస్టర్ రిలీజ్ చేసింది.
బాబాయ్- అబ్బాయ్ ఒకే వేదికపైకి రాబోతున్నారు.మా నాయకుడు వస్తున్నాడు అంటూ స్పెషల్ పోస్టర్స్ విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ పోస్టర్స్ వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ వేడుక ఏపీలో నిర్వహించడం విశేషం.
ఇటీవల తెలంగాణలో సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్నటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా వేడుకను ఏపీలో నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది.